iDreamPost

ఈ కోర్సులు నేర్చుకుంటే మీకు తిరుగుండదు.. ఎక్కువ కంపెనీలు ఆశిస్తున్న స్కిల్స్ ఇవే!

Highly Demanded Courses: ఎవరైనా కోరుకునేది మంచి జీతం.. మంచి జీవితం. మంచి జీతం వచ్చే ఉద్యోగం, మంచి జీవితం పొందాలంటే కేవలం అప్పుడే చదువు పూర్తి చేసి బయటకొచ్చిన యువకులకు ఉంటుంది. మీకు కూడా జీవితంలో మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని అనుకుంటే కనుక ఈ కోర్సులు నేర్చుకోండి. ప్రస్తుతం హైదరాబాద్ లో కంపెనీలు ఈ కోర్సులు నేర్చుకున్నవారినే రిక్రూట్ చేసుకుంటున్నాయి.

Highly Demanded Courses: ఎవరైనా కోరుకునేది మంచి జీతం.. మంచి జీవితం. మంచి జీతం వచ్చే ఉద్యోగం, మంచి జీవితం పొందాలంటే కేవలం అప్పుడే చదువు పూర్తి చేసి బయటకొచ్చిన యువకులకు ఉంటుంది. మీకు కూడా జీవితంలో మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని అనుకుంటే కనుక ఈ కోర్సులు నేర్చుకోండి. ప్రస్తుతం హైదరాబాద్ లో కంపెనీలు ఈ కోర్సులు నేర్చుకున్నవారినే రిక్రూట్ చేసుకుంటున్నాయి.

ఈ కోర్సులు నేర్చుకుంటే మీకు తిరుగుండదు.. ఎక్కువ కంపెనీలు ఆశిస్తున్న స్కిల్స్ ఇవే!

హైదరాబాద్ ఇది తెలుగు వారికి ఇష్టమైన, అత్యంత అవసరమైన కెరీర్ ప్లానింగ్ సిటీ. టెన్త్ క్లాస్ పాసైన వాళ్ళు, ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఇలా చాలా మంది విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక వచ్చేది ముందు హైదరాబాద్ కే. హైదరాబాద్ వెళ్తే ఎలాగైనా సెటిల్ అవ్వచ్చు అన్న ఒక ధీమా ఉంటుంది. అయితే వీటిలో ఐటీ జాబ్స్ అంటే ముందు గుర్తొచ్చే సిటీ బెంగళూరు. ఆ తర్వాత హైదరాబాద్. బెంగళూరులో జాబ్ చేసేందుకు ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఆసక్తి చూపించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ లోనే జాబ్స్ చేయాలని చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ భావిస్తున్నారట. గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ అండ్ హైరింగ్ ప్లాట్ ఫారం అయిన ఇన్ డీడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు, హైదరాబాద్ సిటీల్లో జాబ్స్ కి కొదవ లేదు. 

ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్:

2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఐటీ జాబ్స్ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై రీసెర్చ్ చేసిన ప్రముఖ ఎంప్లాయ్ మెంట్ సంస్థ ‘ఇన్ డీడ్’ ఒక కొత్త డేటాను విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం.. ఐటీ సెక్టార్ లో ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ టాప్ లో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బెంగళూరులో 24 శాతం ఉద్యోగ నియామకాలు పెరగ్గా.. హైదరాబాద్ లో 41.5 శాతం పెరిగాయి. దేశంలో ఐటీ జాబ్స్ లో హైదరాబాద్, బెంగళూరు సిటీలు టాప్ లో ఉన్నాయి. అయితే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ లో జాబ్ చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. జాబ్ క్లిక్ లలో కూడా హైదరాబాద్ లోనే ఐటీ జాబ్స్ నియామకాలు బాగా పెరిగింది. ఏకంగా హైదరాబాద్ లో 161 శాతం పెరగ్గా.. బెంగళూరులో మాత్రం 80 శాతం పెరిగింది. 

ఈ కోర్సులు నేర్చుకుంటే లైఫ్ సెట్టు:

ఈ లెక్కన హైదరాబాద్ అనేది బెంగళూరుతో పోలిస్తే ఐటీ ఉద్యోగులకు ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉంది. దేశంలో ఐటీ ఉద్యోగాలు కోల్పోతున్నా గానీ హైదరాబాద్ లో మాత్రం ఐటీ ఉద్యోగ అవకాశాలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ లో కెరీర్ ప్లాన్ చేసుకోవాలనుకునేవారు ఈ కోర్సులు నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న కంపెనీలు అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న స్కిల్స్ జాబితా చూసుకుంటే.. వాటిలో మొదటిది అనాలిసిస్ స్కిల్స్ ఉంది. ఆ తర్వాత అజైల్, ఏపీఐ, జావా స్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్ ఉన్నాయి. ప్రస్తుతం టాప్ ఐటీ కంపెనీలు ఈ స్కిల్స్ ని బేస్ చేసుకునే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈ స్కిల్స్ ఒకటి నేర్చుకుని ఐటీ రంగంలో స్థిరపడండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి