iDreamPost

Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

  • Published Apr 06, 2024 | 1:54 PMUpdated Apr 06, 2024 | 1:54 PM

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Apr 06, 2024 | 1:54 PMUpdated Apr 06, 2024 | 1:54 PM
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

నిత్యం ప్రతి రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మద్యం మత్తు, అతి వేగం వంటి కారణాల వల్లనే అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యాక్సిడెంట్ కారణంగా అమాయకులు కూడా బలువుతుంటారు. అప్పటి వరకు సాజావుగా సాగుతున్న జీవితం రోడ్డు ప్రమాదం కారణంగా రోడ్డున పడుతుంది. వారు కోలుకోవడానికి ఓ తరం పడుతుంది. ఇవన్ని తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రమాదాలకు కారణం అవుతుంటారు.

ఇక రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా యాక్సిడెంట్లు మాత్రం తగ్గడం లేదు. మద్యం మత్తులో కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో నగరంలో కొన్ని హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఒకదాన్ని మరవకముందే.. అలాంటి ఘటనలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మాదాపూర్ దుర్గం చెరువు కేబల్ బ్రిడ్జిపై మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఇద్దరు యువకులు చనిపోయారు. ఆ వివరాలు.

ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొందరు స్నేహితులు శనివారం అర్థరాత్రి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపైకి వచ్చి సరదాగా ఫోటోలు తీసుకుంటున్నారు. అదే సమయంలో అటుగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు వారిలో ఇద్దరు యువకులను ఢీకొట్టింది.

ఇక ఈ ప్రమాదంలో ఓ యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు బ్రిడ్జిపై సీసీటీవి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అలానే చనిపోయిన వారి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి