iDreamPost

Hyderabad: వివాహిత జీవితంలో అంతులేని విషాదాన్ని నింపిన ఫోన్‌ కాల్‌.. ఆ చిన్న కారణంతో

  • Published Jun 15, 2024 | 8:42 AMUpdated Jun 15, 2024 | 8:42 AM

హైదరాబాద్‌, చందానగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివాహిత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అసలేం జరిగింది.. ఇంతటి దారుణం ఎవరు చేశారంటే..

హైదరాబాద్‌, చందానగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివాహిత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అసలేం జరిగింది.. ఇంతటి దారుణం ఎవరు చేశారంటే..

  • Published Jun 15, 2024 | 8:42 AMUpdated Jun 15, 2024 | 8:42 AM
Hyderabad: వివాహిత జీవితంలో అంతులేని విషాదాన్ని నింపిన ఫోన్‌ కాల్‌.. ఆ చిన్న కారణంతో

ఆవేశం.. కోపం పేరు ఏదైనా సరే.. అది సృష్టించే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. కొన్ని సెకన్ల పాటు మనలో కలిగే ఆ భావోద్వేగం.. ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది. ఆ కొన్ని క్షణాలు మనిషి తన కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోగలిగితే.. చాలా వరకు నేరాలు, దారుణాలు తగ్గిపోతాయి. లేదంటే.. చాలా చిన్న చిన్న కారణాలకే దారుణాలు చోటు చేసుకుంటాయి. ఇక నేడు సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాలకు వివాహేతర సంబంధాలు, క్షణికావేశం ప్రధాన కారణాలు అవుతున్నాయి. పెళ్లైన ఓ మహిళ.. యువకుడితో రిలేషన్‌లో ఉంది. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ చిన్న సంఘటనతో దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఫోన్‌ బిజీ రావడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు.. వివాహితను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన విజయలక్ష్మి (32) అనే వివాహిత చందానగర్ పరిధిలోని నల్లగండ్ల లక్ష్మీ విహార్‌లో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే వారి ఇళ్లల్లో వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు భరత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (జూన్ 14) మధ్యాహ్నం భరత్‌.. చాకుతో విజయలక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం చందానగర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు భరత్‌.

నిందితుడు లొంగిపోవడంతో.. దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని విజయలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఫోన్‌ కాల్‌ వెయిటింగ్‌ రావడంతో ఈ దారుణం చోటు చేసుకుందని తెలుస్తోంది. భరత్‌.. విజయలక్ష్మి‌కి కాల్‌ చేశాడు. ఆ సమయంలో ఆమె ఫోన్‌ బిజీగా వచ్చింది. దాంతో ఆగ్రహానికి గురైన భరత్‌.. అనుమానంతో విజయలక్ష్మి ఇంటికి వెళ్లి నిలదీశాడు.

ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అప్పటికే విచక్షణ కోల్పోయిన భరత్‌.. ఆ కోపంలో తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని విజయలక్ష్మి గొంతు కోసి హత్య చేశాడు. బాధితురాలితో నిందితుడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దర్యాప్తు పూర్తైతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి