iDreamPost

పెళ్లైన 20 రోజులకే.. గుండె కుడివైపున ఉందని భార్యను వదిలేసిన భర్త

భార్య భర్తల మధ్య తలెత్తే గొడవలు దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ భర్త తన భార్యకు గుండె కుడివైపున ఉందంటూ వదిలేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే?

భార్య భర్తల మధ్య తలెత్తే గొడవలు దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ భర్త తన భార్యకు గుండె కుడివైపున ఉందంటూ వదిలేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే?

పెళ్లైన 20 రోజులకే.. గుండె కుడివైపున ఉందని భార్యను వదిలేసిన భర్త

అన్యోన్యంగా నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆర్థిక పరమైన కారణాలు, కుటుంబ కలహాలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం వంటి కారణాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. కొంతమంది అదనపు కట్నం కోసం భార్యలను వేధించడం, చివరాఖరికి వారిని అంతమొందించేందుకు కూడా వెనకాడడం లేదు. పెళ్లైన తర్వాత అందంగా లేవని సూటిపోటి మాటలతో మానసిక వేధనకు గురిచేస్తున్నారు. ఇదే రీతిలో ఓ భర్త పెళ్లైన 20 రోజులకే భార్యకు షాక్ ఇచ్చాడు. ఆమెకు గుండె కుడివైపున ఉందంటూ వదిలేసాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు ఆమె భర్త. పెళ్లైన 20 రోజులకే తన భార్యకు గుండె కుడివైపున ఉందంటూ పుట్టింటికి పంపిచాడు. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన అబ్బనపల్లి భవానిని 2018లో బోనకల్ మండలానికి చెందిన తవుడోజు భాస్కరాచారి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 20 రోజులు కాపురం చేసిన భాస్కరాచారి భార్య భవానిని వేధింపులకు గురిచేశాడు. గుండె కుడివైపున ఉందంటూ పుట్టింటికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత భర్త భాస్కరాచారి ఇంటికి వెళ్లిన భవానిపై మామ వెంకటేశ్వర్లు దాడికి పాల్పడ్డాడు. మామ వెంకటేశ్వర్లు బోనకల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా భర్త భాస్కరాచారి తనను మోసం చేసి పెళ్లి చేశారంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనపై విచారించిన కోర్టు భవానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును కూడా భాస్కరాచారి ధిక్కరించడంతో భవాని తనకు న్యాయం చేయాలంటూ పోరాడుతోంది. ప్రస్తుతం భవాని భర్త భాస్కరచారి పరారీలో ఉండగా, భర్త ఆచూకీ తెలపకుండా అత్తమామలు గోప్యంగా ఉంచుతున్నారని తెలిపింది. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ కోరుతోంది. గుండె ఎటువైపు ఉంటే ఏంటీ.. దీన్ని ఓ కారణంగా చూపి ఆమెను వదిలించుకునేందుకే ఈ నాటకం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి గుండె కుడివైపున ఉందంటూ భార్యను వదిలేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి