iDreamPost

శ్రీలంకలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు

ఇటీవల పలు దేశాల్లో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది.. దీని ప్రభావం భారత్ పై పడటంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించింది.

ఇటీవల పలు దేశాల్లో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది.. దీని ప్రభావం భారత్ పై పడటంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించింది.

శ్రీలంకలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు

గత కొంత కాలంగా ప్రపంచంలో పలు దేశాల్లో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి 50 వేల మందికి పైగా మరణించారు.. కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, మలేషియా, నేపాల్, భారత్, పాకిస్థాన్ లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో నేపాల్ లో సంభవించిన భూకంపం కారణంగా 160 మందికి పైగా చనిపోయారు.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా శ్రీలంకలో భారీ భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతగా నమోదు అయ్యింది. కొలంబో పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ‘కొలంబోకు ఆగ్నేయం వైపు 1,326 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 12.31 గంటలకు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం దాదాపు పది కిలోమీటర్ల లోతులో ఉంది’ అంటూ ఎన్‌సీఎస్ ట్వీట్ చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదని తెలిపింది.

ప్రస్తుతం భూకంపం వల్ల తక్షణమే ఎలాంటి ముప్పు లేదని ది జియోలాజికల్ సర్వేఅండ్ మైన్స్ బ్యూరో తెలిపింది. హిందూ మహాసంద్రలో శ్రీలంకకు ఆగ్నేయ దిశలో 800 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. సముద్రంలో భూకంపం రావడంతో సునామీ ముప్పు ఏదైనా ఉంటుందేమో ప్రజలు భయపడుతున్నారు. గత రెండు రోజులుగా దక్షిణ సూడాన్, తజికిస్థాన్, తైమూర్, ఇండోనేషియా, ఉగండా తదితర దేశాల్లో పలు మార్లు భూకంపం చోటు చేసుకున్నాయి. భూకంప ప్రభావంతో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది. భూకంపం పేరు చెబితేనే ప్రజలకు వెన్నుల్లో వణుకు పుడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి