iDreamPost

IND vs SA: అంత లావున్న భవుమాని ఎలా ఆడిస్తున్నారు? సౌతాఫ్రికా కెప్టెన్ పై గిబ్స్ ఫైర్!

అంత లావుగా, అన్ ఫిట్ గా ఉన్న ప్లేయర్ ఎలా ఆడిస్తున్నారు? అంటూ సౌతాఫ్రికా కెప్టెన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు ఆ జట్టు మాజీ ప్లేయర్ హెర్షల్ గిబ్స్. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

అంత లావుగా, అన్ ఫిట్ గా ఉన్న ప్లేయర్ ఎలా ఆడిస్తున్నారు? అంటూ సౌతాఫ్రికా కెప్టెన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు ఆ జట్టు మాజీ ప్లేయర్ హెర్షల్ గిబ్స్. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

IND vs SA: అంత లావున్న భవుమాని ఎలా ఆడిస్తున్నారు? సౌతాఫ్రికా కెప్టెన్ పై గిబ్స్ ఫైర్!

క్రికెట్ లాంటి జెంటిల్ మెన్ గేమ్ కే కాదు.. ఇతర క్రీడలకు కూడా ఫిట్ నెస్ ఎంతో అవసరం. గ్రౌండ్ లో చిరుతలా వేగంగా కదిలినప్పుడే ప్రత్యర్థిపై మనం పైచేయి సాధించగలం. లావుగా ఉన్న ప్లేయర్లు మైదానాల్లో ఎంత నెమ్మదిగా కదులుతారో ప్రపంచ క్రికెట్ లో మనం ఎన్నో మ్యాచ్ ల్లో, ఎన్నో సార్లు చూశాం. తాజాగా ఓ స్టార్ ప్లేయర్ లావుగా ఉన్నాడని, అతడిని ఎలా జట్టులో ఆడిస్తున్నారని ఫైర్ అయ్యాడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హెర్షల్ గిబ్స్. గిబ్స్ విమర్శించింది ఎవరినో కాదు.. ప్రస్తుతం సౌతాఫ్రికాకు సారథిగా వ్యవహరిస్తున్న టెంబా బవుమాను. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లీ కొట్టిన షాట్ ను ఆపే ప్రయత్నంలో గాయపడ్డాడు బవుమా. దీంతో అతడు గ్రౌండ్ ను వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షల్ గిబ్స్ బవుమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తీవ్రంగా గాయపడ్డాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 20వ ఓవర్ లో కోహ్లీ ఓ షాట్ ఆడాడు. అయితే ఆ బాల్ ను ఆపే క్రమంలో బవుమా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో నొప్పితో గ్రౌండ్ వీడాడు బవుమా. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్ తీయగా.. కండరాల్లో నరం పట్టేసినట్లు తేలింది. అయితే అతడు మ్యాచ్ ఆడే విషయాన్ని వైద్యులు నివేదిక ఇచ్చిన తర్వాత వెల్లడిస్తామని సౌతాఫ్రికా మేనేజ్ మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అన్ ఫిట్ గా ఉన్న బవుమాను అసలు జట్టులోకి ఎలా తీసుకున్నారు అంటూ ఫైర్ అయ్యాడు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హెర్షల్ గిబ్స్.

gibbs comments on bavuma

“2009లో దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ కు ట్రైనర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఓ వ్యక్తి, కోచ్ గా మారి అన్ ఫిట్, అధిక బరువున్న ప్లేయర్లను మ్యాచ్ లు ఆడించడం కామెడీగా ఉంది. ఇది జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుంది” అంటూ సోషల్ మీడియా వేదిగా ఫైర్ అయ్యాడు గిబ్స్. బవుమా లావుగా ఉండటంతో.. గ్రౌండ్ లో సరిగ్గా కదలలేడని, అతడి స్థానంలో మరోకరిని జట్టులోకి తీసుకుంటే ఉపయోగపడతాడనే ఉద్దేశంలో గిబ్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా.. బవుమా ఫిట్ నెస్ పై గతంలో కూడా మాజీలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అదీకాక అతడి ఫామ్ ప్రస్తుతం అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మరి సౌతాఫ్రికా కెప్టెన్ పై ఆ జట్టు మాజీ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి