iDreamPost

ఆ ప్రభుత్వ పాఠశాలలో నో ఆడ్మిషన్ బోర్డు.. ప్రైవేటు స్కూల్ ధీటుగా.. కారణం అదే!

Siddipet ZP High School: నేటికాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Siddipet ZP High School: నేటికాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఆ ప్రభుత్వ పాఠశాలలో నో ఆడ్మిషన్ బోర్డు.. ప్రైవేటు స్కూల్ ధీటుగా.. కారణం అదే!

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠాశాలల్లో మంచి విద్య అందుతుందని చాలా మంది భావిస్తుంటారు.  అందుకే ఎంత ఫీజులైన కట్టి ప్రైవేటు స్కూల్స్ లోనే తమ పిల్లలను ఎక్కువ మంది తల్లిదండ్రులు జాయిన్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు అంటే.. చాలా మందికి ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. అయితే ఓ ప్రభుత్వ బడి మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కారణం.. అక్కడ అడ్మిషన్ కోసం వచ్చిన లేవని నో బోర్డు పెట్టారు. ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ఆ ప్రభుత్వ బడి ఉంది. మరి..ఆ స్కూల్ ఎక్కడ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

నేటికాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. భారీగా డబ్బులు ఖర్చుచేసి మరీ ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారు. కొంచెం పేరున్న విద్యాసంస్థల్లో అయితే అడ్మిషన్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ఇదే సమయంలో విద్యార్థులు లేక సర్కారీ బడులు మూతబడుతున్నాయనే వార్తలు మనకు వింటూనే ఉన్నాం. కానీ, ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

No admission board in government school

ఆ ప్రభుత్వ స్కూల్ లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే డిమాండ్  ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇలా గత తొమ్మిదేళ్ల నుంచి జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలోని ఇందిరానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం 6,10 తరగతుల్లో ప్రవేశాలు ప్రారంభించారు. ఆ స్కూల్ మొత్తం 250 సీట్లు ఉన్నాయి. కానీ వచ్చిన దరఖాస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. ఉన్న సీట్ల కంటే రెండు మూడు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 650 దరఖాస్తులు రావడంతో నో అడ్మిషన్స్ అనే బోర్డును స్కూల్ గేటుకు వేలాడదీశారు.

విద్యార్థులకు ఓ పరీక్ష నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనున్నారు. గతేడాది ఈ స్కూల్ నుంచి  231 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా.. కేవలం ఒక్కరంటే ఒక్కరే ఫెయిల్ అయ్యారంట. ఈ పాఠశాలలో అన్ని తరగతులకు కలిసి 1200 మంది విద్యార్థుల చదువుకోవడానికి సామార్థ్యం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 250 సీట్లు  మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇటీవలకాలంలో ప్రైవేట్‌ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రవేశాలు జరగడం శుభపరిణామమని పలువురు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన పాఠశాలల్లో కూడా ఇలానే ఉండాలని చాలా మంది ఆశిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి