iDreamPost

కూచిపూడి గిన్నీస్ రికార్డ్

కూచిపూడి గిన్నీస్ రికార్డ్

కూచిపూడి-ఆంధ్రప్రదేశ్.. ఈ రెండిటినీ వేరుగా చూడలేము.. భారత సాంప్రదాయ 11 నృత్యాలలో కూచిపూడి ఒకటి.ఈ నృత్యం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టిందని అంటారు.17 వ శతాబ్ధం లో నారాయణ తీర్ధులు కూచిపూడికి మరింత జీవం పోశారని చెబుతారు.నారాయణ తీర్ధుల కృష్ణ లీల తరంగాలు, రుక్మిణీ, రామయ్య శాస్త్రి భామా కలాపం,గొల్ల కలాపం ప్రసిద్ధి కెక్కాయి.పేర్నీ తాండవం చూస్తే రెండు కళ్ళు చాలవు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ కల్చరల్ కమీషన్ ,త్యాగయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మద్రాసు శ్రీ రామచంద్ర కన్వెన్షన్ హాలు లో నాలుగు వేల ఐదువందల మంది విద్యార్ధులతో ప్రపంచ అతి పెద్ద కూచిపూడి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ వారు రికార్డ్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ సర్టిఫికేట్ అందించారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి