iDreamPost

దాతల సాయంతో విజయం.. భావోద్వేగానికి గురైన అభ్యర్థి!

Geniben Thakor: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని అందించగా, మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి.అలానే ఓ అభ్యర్థి తన విక్టరీ అనంతరం కన్నీరు పెట్టుకున్నారు. దాతాలు చేసిన సాయంతో ఆయన విజయ తీరాలకు చేరారు.

Geniben Thakor: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని అందించగా, మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి.అలానే ఓ అభ్యర్థి తన విక్టరీ అనంతరం కన్నీరు పెట్టుకున్నారు. దాతాలు చేసిన సాయంతో ఆయన విజయ తీరాలకు చేరారు.

దాతల సాయంతో  విజయం.. భావోద్వేగానికి గురైన అభ్యర్థి!

జూన్ 4వ తేదీన భారత దేశ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టనుంది. అయితే 2019 ఎన్నికల్లో చూపించిన ప్రభావం ఈ ఎన్నికల్లో  బీజేపీ చూపించలేకపోయింది. ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడమే కాకుండా సొంతంగా మెజార్టీ కూడా పొందలేదు. అయితే ఎన్డీఏ కూటమిగా 292 స్థానాలను పొందింది. ఇదే సమయంలో ఇండియా కూటమి కూడా భారీగా పుంజుకుంది. ఇవి ఇలా ఉంటే.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు యువత ఎంపీలుగా ఎన్నికయ్యారు. అలానే ఓ అభ్యర్థి గెలుపు అందరిని కన్నీరు పెట్టించింది. దాతల సాయంతో విరాళం సేకరించి..ఎన్నికల ప్రచారం చేసి..చివరకు విజయం సాధించింది.

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని అందించగా, మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే కొందరి విజయాలు మాత్రం చిరస్థాయిలో నిల్చిపోయేలా ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్ని చివరకు విజయం సాధించిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు. కొన్ని విజయాలు కొందరికి అంతులేని  ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. అలానే ఓ అభ్యర్థి తన విక్టరీ అనంతరం కన్నీరు పెట్టుకున్నారు. దాతాలు చేసిన సాయంతో ఆయన విజయ తీరాలకు చేరారు. గుజరాత్‌ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి గెనిబెన్‌ థాకూర్‌ అపూర్వ విజయం సొంతేం చేసుకున్నారు

గుజరాత్  రాష్ట్రంలోని బనస్కాంతా నియోజవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెనిబెన్ థాకూర్ పోటీ చేశారు. ఇక్కడ అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా ఒక్కస్థానంలో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి. బనస్కాంతా నియోజవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెనిబెన్ విజయం సాధించారు. తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాక  ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు.

ఈమె తన ఎన్నికల ప్రచారాని సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్‌ సోర్సింగ్‌ ద్వారా దాతల నుంచి సేకరించండ జరిగింది. అలా దాతల నుంచి వచ్చిన విరాళంతో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ కొందరికి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలానే గెనిబెన్‌ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు.  మరి.. గెనిబెన్ అద్భుత విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి