iDreamPost

Rinku Singh: నయా సెన్సేషన్ రింకూ సింగ్ పై గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నయా సెన్సేషన్ రింకూ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నయా సెన్సేషన్ రింకూ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Rinku Singh: నయా సెన్సేషన్ రింకూ సింగ్ పై గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రింకూ సింగ్.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. దానికి కారణం అతడి అసాధారణ ఆటే. తనకంటే సీనియర్ బ్యాటర్లు విఫలం అవుతున్న వేళ.. అద్భుత ఆటతీరుతో దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో దుమ్మురేపిన రింకూ.. అదే ఫామ్ ను సౌతాఫ్రికా గడ్డపై కూడా కొనసాగిస్తున్నాడు. సఫారీ టీమ్ తో జరిగిన తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో మ్యాచ్ లో 68 పరుగులతో సత్తా చాటి అజేయంగా నిలిచి భారత్ భారీ స్కోర్ అందించాడు. కానీ డక్ వర్త్ లూయిస్ పద్దతితో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలనే అతడి ఆటతీరుపై టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చెలరేగి ఆడాడు యువ సంచలనం రింకూ సింగ్. తనకే సాధ్యమైన ఆటతో కేవలం 30 బంతుల్లోనే అర్దశతకం బాది సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో రింకూ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.

Rinku deserves it

స్టార్ స్పోర్ట్స్ తో గంభీర్ మాట్లాడుతూ..”రింకూ ఇంత అద్భుతంగా ఆడటానికి అతడు ఎంతో కష్టపడి ఉంటాడు. అంత సులువుగా రింకూకు ఏదీ లభించదు. ఇక అతడు అద్భుతంగా రాణిస్తే.. రింకూ ఒక్కడికే కాదు ఆ పేరు దేశానికి కూడా వస్తుంది. అందరూ సంతోషిస్తారు. అదీకాక అతడు పొందే విజయాలన్నింటి రింకూ అర్హుడు” అంటూ గంభీర్ కితాబిచ్చాడు. పేస్ కు అనుకూలించే సఫారీ పిచ్ పై రింకూ ఆట అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సిరీస్ లో నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14(గురువారం)న జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది. మరి రింకూ సింగ్ పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి