iDreamPost

ఎస్పీవై ఆగ్రోలో గ్యాస్‌ లీక్‌.. పరుగులు తీసిన ప్రజలు

ఎస్పీవై ఆగ్రోలో గ్యాస్‌ లీక్‌.. పరుగులు తీసిన ప్రజలు

విశాఖపట్నం సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్టీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన తాలూకు పరిణామాలు ఇకా కొనసాగుతుండగానే కర్నూలు జిల్లా నంద్యాలో మరో గ్యాస్‌లీకేజీ ఘటన చోటుచేసుకుంది. శనివారం నంద్యాల సమీపంలోని ఎస్పీవై ఆగ్రోస్‌ కంపెనీలో అమ్మోనియా గ్యాస్‌ లీకైంది. ఒక్కసారిగా గ్యాస్‌ లీక్‌కావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. విషవాయువు పీల్చడంతో ముగ్గురు అస్వస్థకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిచారు.

అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటన తర్వాత కర్మాగారాలు, పరిశ్రమల్లో గ్యాస్‌ లీకేజీ ఘటనలు ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. గ్యాస్‌ ప్రభావం కంపెనీ చుట్టుపక్కల దాదాపు 5 కిలోమీటర్ల మేర వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస, పునర్నిర్మాణ చర్యలు చేపట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి