iDreamPost

Gandharwa Movie గంధర్వ రిపోర్ట్

Gandharwa Movie గంధర్వ రిపోర్ట్

నిన్న లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డేతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి గంధర్వ. జార్జ్ రెడ్డిలో హీరోగా నటించి ప్రేక్షకుల దృష్టిలో పడ్డ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించిన మూవీ ఇది. సాయికుమార్ తో పాటు ఇతర తారాగణం ఆసక్తికరంగా ఉండటంతో పెద్దగా అంచనాలేం లేకపోయినా టీమ్ మాత్రం టాక్ నే నమ్ముకుని థియేటర్లో అడుగుపెట్టింది. రిపోర్ట్ చూద్దాం.

1971 సంవత్సరంలో కథ మొదలువుతుంది. కెప్టెన్ అవినాష్(సందీప్ మాధవ్)కు అమూల్య(గాయత్రి ఆర్ సురేష్)తో పెళ్లవుతుంది. ఈలోగా పాకిస్థాన్ తో యుద్ధం కోసమని ఆర్మీ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్ళిపోతాడు. ప్రమాదవశాత్తు ఓ లోయలోకి పడిపోతే అందరూ చనిపోయాడనుకుంటారు. అలా యాభై సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ అతను తిరిగి రావడం చూసి కుటుంబం షాక్ అవుతుంది. అమూల్య అతన్ని తన భర్తే అని నమ్ముతుంది. ఆ తర్వాత ఏమైంది, అవినాష్ అన్నేళ్లు ఎక్కడున్నాడు అనేదే అసలు కథ.

పెర్ఫార్మన్స్ పరంగా సందీప్ మాధవ్, సాయి కుమార్, రోహిణి, బాబుమోహన్, గాయత్రి సురేష్ ఎవరికి వారు ఓకే అనిపించారు. డిస్కో రాజా తరహాలో హీరో అన్నేళ్ల తర్వాత కూడా అదే రూపంలో రావడం సరిగా రిజిస్టర్ చేయలేదు. స్క్రీన్ ప్లే తో పాటు అవసరం లేని సన్నివేశాలు చాలా ఉండటంతో గంధర్వ ఏ దశలోనూ బాగుందనే ఫీలింగ్ కలిగించదు. కొన్ని సీన్స్ ని మరీ సిల్లీగా డిజైన్ చేసుకున్నారు. ఎంగేజింగ్ గా లేని కథనం అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీసింది. ఖచ్చితంగా నిరాశపరచాలనే దర్శకుడు అప్సర్ లక్ష్యం నెరవేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి