iDreamPost

వీడియో: బౌలింగ్ వేయాలని ఫ్యాన్స్ నినాదాలు.. కోహ్లీ ఏం చేశాడో చూడండి

  • Author Soma Sekhar Published - 08:41 AM, Fri - 3 November 23

శ్రీలంకతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ కు మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్ బౌలింగ్ వేయాలని ఫ్యాన్స్ మెుత్తం ఒక్కసారిగా అరుపులు పెట్టారు. దీంతో విరాట్ కోహ్లీ వారివైపు తిరిగి ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.

శ్రీలంకతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ కు మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్ బౌలింగ్ వేయాలని ఫ్యాన్స్ మెుత్తం ఒక్కసారిగా అరుపులు పెట్టారు. దీంతో విరాట్ కోహ్లీ వారివైపు తిరిగి ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 08:41 AM, Fri - 3 November 23
వీడియో: బౌలింగ్ వేయాలని ఫ్యాన్స్ నినాదాలు.. కోహ్లీ ఏం చేశాడో చూడండి

వరల్డ్ కప్ 2023లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది టీమిండియా. తాజాగా వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి..సెమీస్ లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఇక ఈ ప్రపంచ కప్ లో ఇండియాకు ఇది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ లో చెలరేగిన భారత ఆటగాళ్లు.. ఆ తర్వాత బౌలింగ్ లో రఫ్పాడించారు. ముఖ్యంగా షమీ 5 వికెట్లు తీసి.. లంక మిడిలార్డర్ ను కాకవికలం చేశాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ కు మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్ బౌలింగ్ వేయాలని ఫ్యాన్స్ మెుత్తం ఒక్కసారిగా అరుపులు పెట్టారు. దీంతో విరాట్ కోహ్లీ వారివైపు తిరిగి ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ.. వరల్డ్ కప్ లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ 88 పరుగులకే అవుటై నిరాశగా వెనుదిరిగాడు విరాట్. ఇక ఈ మ్యాచ్ లో ఓ సరదా సన్నివేశం జరిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను బెంబేలెత్తించారు టీమిండియా బౌలర్లు. బుమ్రా, షమీ, సిరాజ్ పేస్ త్రయం నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. లంక బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో కనీసం 10-15 ఓవర్లైనా లంక జట్టు బ్యాటింగ్ చేస్తుందా? అన్న అనుమానం మ్యాచ్ ప్రారంభం నుంచే కలిగింది.

ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ మధ్య ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఎలాగో శ్రీలంక గెలిచే పరిస్థితిలో లేదు కాబట్టి.. విరాట్ కోహ్లీని బౌలింగ్ చేయాలని గ్రౌండ్ లోని ఫ్యాన్స్ ఒక్కసారిగా అరిచారు.’కోహ్లీ డూ బౌలింగ్’ అన్న నినాదాలతో స్టేడియం మెుత్తం దద్దరిల్లడంతో.. కోహ్లీ వారిపైపు తిరిగి రెండు చేతులెత్తి దండం పెట్టాడు. నా వల్ల కాదు అంటూ చెయ్యితో సైగచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఫ్యాన్స్ ఇలా అరవడానికి కారణం లేకపోలేదు.

ఈ క్రమంలోనే లంక వికెట్లు టపటపా రాలడంతో.. కోహ్లీ మధ్యలో నెక్ట్స్ బౌలింగ్ కి దిగే బౌలర్ వామప్ చేసినట్లుగా చేశాడు. ఇది గమనించిన అభిమానులు ఒక్కసారిగా కోహ్లీ బౌలింగ్ వేయాలని అరిచారు. కాగా.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లకు 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో గిల్(92), కోహ్లీ(88), అయ్యర్(82) పరుగులతో రాణించారు. అనంతరం 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 55 రన్స్ కే కుప్పకూలింది. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లతో సత్తాచాటగా.. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియా తన నెక్ట్స్ మ్యాచ్ నవంబర్ 5న పటిష్టమైన సౌతాఫ్రికాతో తలపడబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి