iDreamPost

MDH, ఎవరెస్ట్‌లకు క్లీన్‌ చిట్‌.. క్యాన్సర్‌కు కారకాలు లేవు

  • Published May 22, 2024 | 11:31 AMUpdated May 22, 2024 | 11:31 AM

Everest And MDH: విదేశాల్లో నిషేధం ఎదుర్కొంటున్న ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాల బ్రాండ్లకు భారీ ఊరట లభించింది. తాజాగా వాటికి క్లీన్‌ చీట్‌ వచ్చింది. ఆ వివరాలు..

Everest And MDH: విదేశాల్లో నిషేధం ఎదుర్కొంటున్న ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాల బ్రాండ్లకు భారీ ఊరట లభించింది. తాజాగా వాటికి క్లీన్‌ చీట్‌ వచ్చింది. ఆ వివరాలు..

  • Published May 22, 2024 | 11:31 AMUpdated May 22, 2024 | 11:31 AM
MDH, ఎవరెస్ట్‌లకు క్లీన్‌ చిట్‌.. క్యాన్సర్‌కు కారకాలు లేవు

ఇండియాలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన మసాల బ్రాండ్లు.. ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌లకు ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం ఈ రెండు మసాల బ్రాండ్స్‌ను నేపాల్‌, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాల్లో నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలకు చెందిన మసాల దినుసుల్లో.. ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని.. అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నామని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాల పొడి, ఎండీహెచ్‌ మసాలలో పురుగుమందు అవశేషాలు అధిక స్థాయిలో ఉన్నాయని.. దీనిలో ఉన్న ఇథిలీన్‌ ఆక్సైడ్‌ క్యాన్సర్‌ కారకమని.. అందుకే దీన్ని నిషేధిస్తున్నామని ప్రకటించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ రెండు కంపెనీలకు ఊరట లభించింది. వీటిల్లో ఎలాంటి క్యాన్సర్‌ కారక ఆనవాళ్లు లేవని పరీక్షల్లో తేలడంతో.. క్లీన్‌ చిట్‌ లభించింది. ఆ వివరాలు..

క్యాన్సర్‌ కారక ఆనవాళ్లు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన ప్రముఖ మసాల బ్రాండ్‌లు ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సంస్థలకు.. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ రెండు ప్రధాన మసాల బ్రాండ్లలో ఎలాంటి ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఆనవాళ్ళు లేవని స్పష్టం చేసింది. ఈ రెండు కంపెనీలకు చెందిన శ్యాంపిళ్లను.. సుమారు 28 ల్యాబుల్లో పరీక్షలు చేశారు. తాజాగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆ రిపోర్టులను విడుదల చేసింది. మరో ల్యాబ్‌కు సంబంధించిన రిపోర్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొన్న‌ది. ఎండీహెచ్‌, ఎవ‌రెస్ట్ బ్రాండ్ల మసాలాలు నాణ్య‌త లేవ‌ని హాంగ్‌కాంగ్, సింగ‌పూర్ ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ రిపోర్టును రిలీజ్ చేసింది.

కొన్ని రోజుల క్రితం ఎండీహెచ్‌, ఎవ‌రెస్ట్ బ్రాండ్ల‌కు చెందిన కొన్ని మ‌సాలా ప్యాకెట్ల‌లో మోతాదుకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని.. అది క్యాన్సర్‌ కారకం అని.. కనుక జనాలు ఎవరూ ఈ మసాలను కొనవద్దని హాంగ్‌కాంగ్ సెంట‌ర్ ఫ‌ర్ ఫుడ్ సేఫ్ట్ త‌మ దేశ పౌరుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇక హాంగ్‌కాంగ్ బ్యాన్ చేసిన ఉత్ప‌త్తుల్లో ఎండీహెచ్ మ‌ద్రాస్ క‌ర్రీ పౌడ‌ర్‌, ఎవ‌రెస్ట్ ఫిష్ క‌ర్రీ మ‌సాలా, ఎండీహెచ్ సాంబార్ మ‌సాలా మిక్స్‌డ్ మ‌సాలా పౌడ‌ర్‌, ఎండీహెచ్ క‌ర్రీ పౌడ‌ర్ ఉన్నాయి.

ఈ మ‌సాలాల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో ఆ మ‌సాలా ప్యాకెట్ల‌ను సేకరించి ఫుడ్ సేఫ్టీ సంస్థ అధికారులు.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఎన్ఏబీఎల్ అక్రిడేష‌న్ ఉన్న ల్యాబుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఆనవాళ్ల మీద ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ రెండు బ్రాండ్లే కాకుండా ఇత‌ర బ్రాండ్ల‌కు చెందిన మ‌రో 300 శ్యాంపిళ్ల‌ను కూడా ప‌రీక్షించిన‌ట్లు శాస్త్రీయ నిపుణులు తెలిపారు. చివరకు వీటికి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వీటిల్లో ఎలాంటి క్యాన్సర్‌ కారక ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి