iDreamPost

ఈ డాక్టర్ నిజంగా దేవుడు.. ఓపీ ఉచితంగా చూస్తూ.. తక్కువ ధరకే మందులు ఇస్తూ!

Free OP In This Hospital: ఈ డాక్టర్ నిజంగా దేవుడు. గుండు నొప్పి వస్తే గుండె నొప్పి ఉంది అని భయపెట్టి క్యాష్ చేసుకునే డాక్టర్స్ ఉన్న ఈ సమాజంలో ఫ్రీగా ఓపీ చూడడంతో పాటు తక్కువ ధరకే మందులు అమ్ముతున్నారు. అంతేనా అవకాశం వచ్చినప్పుడు ఉచితంగా చికిత్స కూడా చేస్తున్నారు. ఈ డాక్టర్ గురించి తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లిపోవాల్సిందే.

Free OP In This Hospital: ఈ డాక్టర్ నిజంగా దేవుడు. గుండు నొప్పి వస్తే గుండె నొప్పి ఉంది అని భయపెట్టి క్యాష్ చేసుకునే డాక్టర్స్ ఉన్న ఈ సమాజంలో ఫ్రీగా ఓపీ చూడడంతో పాటు తక్కువ ధరకే మందులు అమ్ముతున్నారు. అంతేనా అవకాశం వచ్చినప్పుడు ఉచితంగా చికిత్స కూడా చేస్తున్నారు. ఈ డాక్టర్ గురించి తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లిపోవాల్సిందే.

ఈ డాక్టర్ నిజంగా దేవుడు.. ఓపీ ఉచితంగా చూస్తూ.. తక్కువ ధరకే మందులు ఇస్తూ!

ప్రైవేట్ హాస్పిటల్ అయినా, చిన్న చిన్న క్లినిక్ లైనా గానీ ఓపీ అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. కనీసం 300 నుంచి 500 వరకూ ఓపీ చెల్లించాల్సి ఉంటుంది. కొంచెం పెద్ద హాస్పిటల్స్ అయితే ఆ బిల్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఓపీ కేవలం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడానికి మాత్రమే. ఆ తర్వాత ఆ డాక్టర్ జబ్బు చూసి టెస్టులు రాస్తే టెస్టులు చేయించుకోవాలి. దానికి అదనంగా కొంత డబ్బు అవుతుంది. మందులకు మళ్ళీ ప్రత్యేకంగా కొంత డబ్బు అవుతుంది. బయట షాపింగ్ మాల్స్ లో డిస్కౌంట్స్ పెట్టినట్టు  హాస్పిటల్స్ లో కూడా ఆఫర్లు పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించదు. వైద్యం దగ్గర ఎవరూ రాజీపడరు అని చెప్పి తగ్గించే పరిస్థితి కూడా ఉండదు. పైగా బేరం కూడా ఆడరు.

కానీ ఈ హాస్పిటల్ డాక్టర్ నిజంగానే దేవుడు. ఓపీ ఉచితంగా చూస్తుండడమే కాకుండా మందుల దగ్గర కూడా రాయితీ అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని ‘మన అమ్మ’ హాస్పిటల్ లో ఉచితంగా ఓపీ చూస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు, దేశానికి సేవ చేసే ఆర్మీ జవాన్లకు, నా అనే వ్యక్తులను కోల్పోయిన అనాధలకు, వృద్ధాశ్రమంలో వదిలివేయబడిన వృద్ధులకు, జర్నలిస్టులకు, ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఓపీ చూస్తున్నారు. అంతేకాదు తక్కువ ధరకే మందులు అందజేస్తున్నారు. మన అమ్మ ఆసుపత్రి ఎండీ ఆర్థోపెడిక్ డాక్టర్ సుధీర్ కుమార్.. పేదల కోసం, సమాజ సేవ చేసే వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ సేవ చేసిన ఆర్మీ వ్యక్తులకు, పోలీస్ శాఖలో పని చేసే సిబ్బందికి, జర్నలిస్టులకు, వృద్ధాశ్రమం లేదా అనాధ శరణాలయాల్లో ఉండేవారికి, ప్రభుత్వ పాఠశాల, గురుకుల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఓపీ చూస్తామని డాక్టర్ సుధీర్ కుమార్ అన్నారు. మందుల్లో రాయితీ కూడా ఇస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో టీచర్లకు, ప్రైవేట్ ఉద్యోగులకు, చిన్న చిన్న జీతాలకు ప్రైవేట్ రంగ కంపెనీల్లో పని చేసే కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించామని అన్నారు. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న సంకల్పంతో ఇలా సేవ చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల దేవస్థానాలు వంటి ప్రదేశాల్లో, పర్యాటక ప్రదేశాల్లో నెలకొకసారి గానీ రెండు నెలలకొకసారి గానీ సిబ్బందితో కలిసి శుభ్రం చేస్తున్నామని అన్నారు. స్వచ్చంధ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని.. గ్రామాల్లో హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి