iDreamPost

Hyderabad: హైదరాబాద్‌ చరిత్రలోనే తొలిసారి.. ఉరిశిక్ష విధించిన నాంపల్లి కోర్టు

  • Published Jan 19, 2024 | 7:51 AMUpdated Jan 19, 2024 | 7:51 AM

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి ఓ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి ఓ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Jan 19, 2024 | 7:51 AMUpdated Jan 19, 2024 | 7:51 AM
Hyderabad: హైదరాబాద్‌ చరిత్రలోనే తొలిసారి.. ఉరిశిక్ష విధించిన నాంపల్లి కోర్టు

ఉరిశిక్ష అనేది చాలా హేయమైన చర్య అని భావించి.. ఇప్పటికే చాలా దేశాల్లో దాన్ని తొలగించారు. భారతదేశంలో కూడా మరణశిక్షను రద్దు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇక తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన అభిలాష చిత్రం కూడా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. కానీ కొందరు మాత్రం ఉరిశిక్ష కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడుతుంటారు. ఇక నేటి కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని నేరాలు చూస్తే.. నిందితులకు ఉరిశిక్షకే కరెక్ట్‌ అనిపిస్తుంది. ఇక మన దేశాన్ని కుదేపిసిన నిర్భయ కేసులో నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించి అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి ఓ కోర్టు.. ఉరిశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారి దోషిగా తేలిన ఓ నిందితునికి ఉరిశిక్ష విధిస్తూ.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరు సంవత్సరాల క్రితం అనగా 2018లో నమోదైన అదనపు కట్నం కోసం భార్యను చంపిన కేసులో దోషిగా తేలిన నిందితుడైన భర్తకు.. నాంపల్లి కోర్డు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేసు వివరాల విషయానికి వస్తే.. భవానీ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇంజమ్‌ హక్‌ అనే వ్యక్తి పెళ్లైన నాటి నుంచి తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. ఈక్రమంలో చివరకు 2018లో తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

దీంతో.. మృతురాలి తరపు కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడై ఇంజమ్‌ హక్‌.. అదనపు కట్నం కోసం తన భార్యను చిత్ర హింసలు పెట్టి.. చివరికి అత్యంత దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు అన్ని సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానానికి సమర్పించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి.. నిందితుడిని దోషిగా తేల్చింది. ఇక తాజాగా ఈ కేసులో నిందితుడైన ఇంజమ్‌కి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అయితే… హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి