iDreamPost

మా ఊర్లో స్కూల్ చూసి.. సినిమా సెట్టింగ్ అనుకున్నా: కోన వెంకట్

kona venkat, YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. తాజాగా ప్రముఖ రచయిత కోన వెంకట్..జగన్ పరిపాలన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

kona venkat, YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. తాజాగా ప్రముఖ రచయిత కోన వెంకట్..జగన్ పరిపాలన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మా ఊర్లో స్కూల్ చూసి.. సినిమా సెట్టింగ్ అనుకున్నా: కోన వెంకట్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం తన పాలనను సాగిస్తున్నారు. అంతేకాక పరిపాలనతో తనదైన మార్క్ ను చూపించారు. ప్రభుత్వ పథకాలపై  ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన..సీఎం జగన్ ఎక్కడ తగ్గలేదు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వంటివి తీసుకొచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచారు. ఇక సీఎం జగన్ పాలనపై ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తొలుత ఏపీ ప్రభుత్వాన్ని అపార్థం చేసుకున్న వాళ్లు..క్షేత్రస్థాయిలో చూసి.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ రచయితే కోన వెంకట్ సీఎం జగన్ అదుర్స్ అంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో చిత్రాలకు రచయితగా పని చేశారు. ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. అయితే ఇటీవల తన సొంత జిల్లా బాపట్లను సందర్శించి అక్కడ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ  ఫలాలను చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తన సొంతూరు కర్లపాలెంలోని ప్రభుత్వం పాఠశాలను సందర్శించి షాకయ్యారు. అసలు ఇది తాను చదివిన బడేనా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అలానే వివిధ గ్రామలు తిరిగి అక్కడ రైతు భరోసా, సచివాలయాలు, ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించారు. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంస వర్షం కురింపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన  సీఎం జగన పాలనపై సంతోషం వ్యక్తం చేశారు.

కోన వెంకట్ మాట్లాడుతూ..“అందరికి డబ్బులను పంచి పెడుతున్నారు, అభివృద్ధి ఏముంటుందని చాలా మంది అన్నారు. నేను కూడా మొదట్లో ఏపీలో అంత పంచి పెడ్డమే అని అనుకున్నాను. అయితే మా జిల్లాలో తెలిసిన సర్పంచ్ లను, మిగిలిన అందరితో నేను టచ్ లో ఉంటాను. వాళ్లను ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్నాను. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి అంశం గురించి వాళ్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఓ సారి నేను కూడా బాపట్లకు వెళ్లాలని భావించి వెళ్లాను. అక్కడ నేను ప్రతి విలేజ్ సందర్శించాను. ప్రతి విలేజ్ లో సచివాలయం ఉంది. అక్కడి ఉద్యోగుల నిర్వహిస్తున్న విధులు తెలుసుకున్నాను. అలానే వాలంటీర్ వ్యవస్థ వారి ద్వారా ప్రజలకు చేరుకూరుతున్న లబ్ధి గురించి తెలుసుకున్నాను. అలానే రైతు భరోసా కేంద్రాలను దర్శించాను.

మంచి ఎరువులు, విత్తనాలు వంటివి రైతులకు జగన్ ప్రభుత్వం అందిస్తుంది. ఇదే సమయంలో గణపవరం అనే మాములు మూల గ్రామంలోని స్కూల్ ఎంతో అభివృద్ధి చెందింది. డబ్బులు పంచి పెట్టడం కాదు, భవిష్యత్  కోసం ఈ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చూసింది.  ప్రభుత్వ స్కూల్ చదువుకునే పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. అసలు ఇక్కడ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం, వ్యవస్థలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సీఎం జగన్ అదుర్స్, ఆయన పరిపాలన సూపర్. నన్ను ఎవరైన పేటిఎం స్టార్ అన్న పర్లేదు. ఏపీలో నేను చూసిన మంచిని చెప్పకపోతే.. భవిష్యత్ కు నష్టం జరుగుతోంది. కచ్చితంగా సీఎం జగన్ చేస్తున్న ఈ అద్భుత పరిపాలన గురించి అందరికి వివరిస్తాను” అని కోన వెంకట్ పేర్కొన్నారు. మరి..ఏపీ ప్రభుత్వం గురించి కోన వెంకట్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి