iDreamPost

అమానుషం.. కన్నబిడ్డలను అమ్మకానికి పెట్టిన తండ్రి

నేటికాలంలో మానవ సంబంధాలు, రక్తబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా పేగు తెచ్చుకుని పుట్టిన బిడ్డలపైనే కన్నవారు కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ కసాయి తండ్రి.. తన బిడ్డల విషయంలో దారుణం చేశాడు.

నేటికాలంలో మానవ సంబంధాలు, రక్తబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా పేగు తెచ్చుకుని పుట్టిన బిడ్డలపైనే కన్నవారు కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ కసాయి తండ్రి.. తన బిడ్డల విషయంలో దారుణం చేశాడు.

అమానుషం.. కన్నబిడ్డలను అమ్మకానికి  పెట్టిన తండ్రి

మానవ సంబంధాలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. అంతేకాక మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఇక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. అంతేకాక డబ్బుల కోసం సొంత వారిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. ధనం కోసం పేగు బంధాలను కూడా అంగడిలో పెట్టేస్తున్నారు. తాజాగా కన్నబిడ్డలను ఓ కసాయి తండ్రి అమ్మకానికి పెట్టాడు. ఈ అమానుష ఘటన తెలంగాణ రాష్ట్రంలో జడ్చర్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో రఫీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక డబ్బుల కోసం రఫీ పాడు బుద్ది చూపించాడు. డబ్బుల కోసం తన కన్న బిడ్డలను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.  ఈ క్రమంలోనే తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. అనంతరం భార్యకు ఫోన్ చేసి పిల్లలకు కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగారు పడిపోయిన రఫీ భార్య కుటుంబ సభ్యులకు తెలిపింది. వారితో కలిసి జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం తెలిపింది.

అంతేకాక తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రఫీని పట్టుకునేందుకు కృషి చేశారు. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్ ను ట్రాక్ చేశారు. హైదరాబాద్ లోని యాకత్ పురాలోని అతని లోకేషన్ చూపించింది. దీంతో వెంటనే పోలీసులు బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను పోలీసులు గుర్తించి..రక్షించారు. అయితే హైదరాబాద్ లోనే వేరే వాళ్లకు విక్రయించేందుకు రూ.9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

ఏది ఏమైన పోలీసులు వెంటనే స్పందించి.. కేసును చేధించారు. అంతేకాక ఈ అమానుషమైన రియల్ స్టోరీకి క్లైమ్స్ సుఖాంతం చేశారు. పిల్లలను విక్రయించాలనుకున్న రఫీకి బంధువులు, కాలనీవాసులు దేహ శుద్ది చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. కన్న తల్లే బిడ్డలను అమ్మకానికి పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇలా పిల్లలను మార్కెట్ల్ అమ్మకాలకు పెట్టి.. మానవ సంబంధాలకు, రక్త బంధాలకు మాయని మచ్చ తెస్తున్నారు. ఇలా పిల్లలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇలా బిడ్డలను విక్రయించే వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి