iDreamPost

ప్రముఖ సంతూర్ వాయిద్య కారుడు ఇక లేరు…

ప్రముఖ సంతూర్ వాయిద్య కారుడు ఇక లేరు…

భారతీయ సంగీత ప్రపంచంలో ఎన్నో వాయిద్య కళాకారులు ఉన్నారు. అందులో సంతూర్ వాయిద్యం ఒకటి. ఈ సంగీతం పరికరం చెప్పగానే పండిట్ శివకుమార్ శర్మ గుర్తుకొస్తారు. ప్రముఖ సంగీత విద్వాంసుడుగా పేరుగాంచిన ఈయన ఇక లేరు. 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

సంతూర్ వాయిద్యాన్ని తనదైన శైలిలో వాయించి పేరు గడించారు. సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన ఆయన లేరు అని తెలుసుకొన్న అభిమానులు, సంగీత ప్రియులు దిగ్బ్రాంతి చెందారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గుండె పోటుతో తుదిశ్వాస విడిచారని సమాచారం. పండిట్ శివకుమార్ శర్మ మరణంపై భారత ప్రధాన మంత్రి మోడీ, బాలీవుడ్ గాయకుడు విశాల్ డడ్లాని, ప్రముఖ నటుడు మనోజ్ బాజపయ్ సంతాపం తెలిపారు. ఈమేరకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఇక పండిట్ శివకుమార్ విషయానికి వస్తే.. 1938లో కాశ్మీర్ లో జన్మించారు. జానపద వాయిద్య పరికరం అయిన సంతూర్ ను ఆయన ఉపయోగించారు. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీత కారుడు ఆయనే కావడం విశేషం. పలు బాలీవుడ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1981లో పద్మశ్రీ, 2001లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి