iDreamPost

విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ అసత్య ప్రచారాలు.. ఇదీ నిజం!

Visakha Floating Bridge: విశాఖ పర్యాటకుల ఆహ్లాదం కోసం ఆర్ కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రూ.1.60 లక్షల వ్యయంతో నిర్మించారు.

Visakha Floating Bridge: విశాఖ పర్యాటకుల ఆహ్లాదం కోసం ఆర్ కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రూ.1.60 లక్షల వ్యయంతో నిర్మించారు.

విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ అసత్య ప్రచారాలు.. ఇదీ నిజం!

విశాఖ పట్నంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. విశాఖ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఆర్కే బీచ్. దేశ విదేశాల నుంచి విశాఖలో అందమైన ప్రదేశాలు వీక్షించేందుకు పర్యాటకులు వస్తుంటారు. విశాఖలో పర్యాటకుల ఆనందం కోసం ఆదివారం సుమారు కోటీ 60 లక్షలతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి. ఈ కార్యక్రమంలో ఐటీ శాహమంత్రి గుడివాడ అమర్ నాథ్ తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. పర్యాటకు భద్రత కోసం భద్రతా ఏర్పాటు కూడా చేశారు.

విశాఖలో పర్యాటకుల కోసం ఎంతో అట్టహాసంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్రిడ్జి నిర్మించిన 24 గంటలు గడవకముందే..తెగిపోయి సముద్రంలో కొంత దూరం కొట్టుకు పోయిందని.. ఈ ప్రమాదంలో అదృష్టం కొద్ది సందర్శకులు బ్రిడ్జిపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని, ఈ బ్రిడ్జీని ప్రభుత్వం ఎంత నాసిరకంగా ఏర్పాటు చేసిందో అర్ధమవుతుందంటూ.. సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు తెలుగు దేశం, జనసేన పార్టీలకు అనుకూల పత్రికలు, ఛానల్స్ లో పెద్ద ఎత్తున అసత్య ప్రచారం జరుగుతుంది. ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్న చందంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రమాదం కానేలేదు.. ప్రచారాలు మాత్రం తెగ ఊపందుకున్నాయి.

ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశామని.. కానీ ప్రతిపక్ష పార్టీలు తెలుగు దేశం, జనసేన ఇష్టానుసారంగా అసత్య ప్రచారం చేస్తుందని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అసలు అక్కడ ఏం జరిగింది.. నిజం ఏంటో వివరించింది. ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి ఆదివారం నుంచి సందర్శకులకు అనుమతించాలని భావించినప్పటికీ.. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా సముద్ర ప్రవామాల తీవ్రత భారీగా ఉండటం వల్ల సందర్శకులకు సోమవారం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అనుమతించలేదు. అయితే సముద్ర ప్రవాహల తీవ్రత మరింత పెరిగిపోవడంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు ‘టీ’ పాయింట్ (వ్యూ పాయింట్ ) ని బ్రిడ్జీ నుంచి విడదీసి దాన్ని పటిష్టత ఎంత వరకు ఉంది అని పరిశీలించేందుకు ఏంకర్ లను దగ్గరగా జరిపి నిలిపి ఉంచారు. అయితే బ్రిడ్జ్ వ్యూ పాయింట్ ల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి ప్రతిపక్ష పార్టీ నేతలు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. దీనికి తోడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బ్రిడ్జీ కూలిపోయిందని రచ్చ రచ్చ చేశారు. ఇది పూర్తి దుష్ప్రచారాం.. అవాస్తవం.

ఫ్లోటింగ్ బ్రిడ్జీ నుంచి దాని టీ జంక్షన్ వ్యూ పాయింట్ ని సాధారణ మాక్ డ్రిట్స్ లో భాగంగా విడదీసి వేరు చేయడం జరిగిందని, సముద్ర ప్రవాహాలు తీవ్రత ఉన్నపుడు సాధారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనో భాగమే అని, భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మాక్ డ్రిల్స్ ను చేపట్టారని అధికారులు తెలిపారు. దీనిపై విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. తమ స్వలాభం, స్వార్ధం కోసం ఇలా అసత్య ప్రచారం చేస్తూ విశాఖ బ్రాండ్ పేరును అప్రతిష్ట పాలు చేయడమే అని పర్యాటకు కోసం ఏర్పాటు చేసిన దాన్ని భయపట్టేవిధంగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేడం సబబు కాదని.. అలాంటి వారు రాష్ట్ర ద్రోహులు అని అంటున్నారు విశాఖ ప్రజలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి