iDreamPost

నగరంలో నకిలీ వాలంటీర్లు – ఊసలు లెక్కపెట్టిస్తున్న పోలీసులు

నగరంలో నకిలీ వాలంటీర్లు – ఊసలు లెక్కపెట్టిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే పెట్టుబడిగా మార్చుకునేందుకు కొందరు అక్రమార్కులు సిద్ధమయ్యారు. అందుకోసం వాలంటీర్ల అవతారం ఎత్తారు. ఇళ్ల స్థలం, ఫించన్‌ అందిస్తామంటూ పేదల నుంచి వేల రూపాయలు వసూలు చేశారు. ఈ మోసంలో మహిళలే కీలక ప్రాత పొషించారు. విషయం తెలిసి ఆఖరికి కటకటాల పాలయ్యారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పాలగిరి వెంకటేష్‌ అనే వ్యక్తి తనకు పరిచయమున్న సుహాసిని, ఆమె కూతురు కలసి జట్టు కట్టారు. పట్టణ శివారులోని పేదలుండే ప్రాంతాలకు వెళ్లి తాము వాలంటీర్లమని చెప్పి నమ్మించారు. ఇంటి స్థలం ఇప్పిస్తామని చెప్పి 330 రూపాయల చొప్పున, పెన్షన్‌కు వెయ్యి రూపాయలు, ఎస్సీ కార్పొరేషన్‌ రుణానికి పదమూడు వందల రూపాయలు వసూలు చేశారు. వాలంటీర్‌ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, అవి ఇప్పిస్తామని యువత వద్ద 800 చొప్పున వసూలు చేశారు. ఇలా దాదాపు 38 మంది నుంచి వసూలు చేశారు.

ఈ విషయం స్థానికంగా ఉన్న వాలంటీర్లకు తెలియడంతో వారు అవాక్కయ్యారు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ వాలంటీర్లను గుట్టు రట్టయింది. వెకంటేష్, ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేసి ఊసలు లెక్కపెట్టిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి