iDreamPost
android-app
ios-app

DD న్యూస్‌ చిహ్నం రంగులో మార్పు.. ప్రసార భారతి కాదు ప్రచార భారతి అంటూ..

  • Published Apr 19, 2024 | 3:10 PM Updated Updated Apr 19, 2024 | 3:10 PM

DD News Logo: టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో రకాల మార్పులు చేర్పులు వచ్చాయి. అయితే మొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ లోగో రంగు మారింది.

DD News Logo: టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో రకాల మార్పులు చేర్పులు వచ్చాయి. అయితే మొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ లోగో రంగు మారింది.

DD న్యూస్‌ చిహ్నం రంగులో మార్పు.. ప్రసార భారతి కాదు ప్రచార భారతి అంటూ..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.  మరికొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగబోతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా ప్రచారాలతో దుమ్ములేపుతున్నారు నేతలు.  తాజాగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ లోగో విషయంలో జరిగిన మార్పు పెను సంచలనాలకు దారి తీస్తుంది. లోగో రంగు మాత్రమే కాదు.. ఫాంట్ లో కూడా రంగు మారడంపై దుమారం చెలరేగింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎంతో చరిత్ర ఉన్న డీడీ న్యూస్ ఛానల్ లోగో, ఫాంట్ రంగు మార్చడం ఏంటని ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశం మొత్తం లోక్ సభ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ఈ సమయంలో టెలివిజన్ రంగంలో ఎంతో చరిత్ర కలిగిన డీడీ న్యూస్ లోగో రంగు మార్పు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. లోగో తో పాటు న్యూస్ ఫాంట్ కూడా మారిపోయింది. అయితే లోగో, అక్షరాలు కాషాయం రంగు లోకి మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాషాయ రంగులోకి మార్చడం పట్ల అధికార బీజీపీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న డీడీ న్యూస్ లోగో కాషాయరంగులోకి మారిపోయింది.. ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అంటూ గతంలో దూరదర్శన్ సీఈవోగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇది ఖచ్చితంగా అధికార పార్టీ తమ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అని.. దూరదర్శన్ మతచర్య ఉద్రిక్తలను పెంచుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. దూర దర్శన్ ఛానల్ లోగో మార్పు కొంతమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని కొంతమంది విమర్శస్తున్నారు. మరి చూడాలి ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ లోగో మార్పు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడలి. మరోవైను దేశ వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతి పక్ష నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం.