iDreamPost

OTT Movie: OTTలో ఇంత మంచి సినిమాని లైఫ్ లో చూసుండరు! ఇగోనే విలన్!

  • Published Apr 18, 2024 | 4:18 PMUpdated Apr 26, 2024 | 6:22 PM

ఇప్పుడు వస్తున్న ఓటీటీ సినిమాల గురించి.. సిరీస్ ల గురించి సోషల్ మీడియా లో బజ్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వాటిని ఎవరు మిస్ చేసి ఉండరు. కానీ, ఎప్పుడో వచ్చిన ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం ఒక మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే.

ఇప్పుడు వస్తున్న ఓటీటీ సినిమాల గురించి.. సిరీస్ ల గురించి సోషల్ మీడియా లో బజ్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వాటిని ఎవరు మిస్ చేసి ఉండరు. కానీ, ఎప్పుడో వచ్చిన ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం ఒక మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే.

  • Published Apr 18, 2024 | 4:18 PMUpdated Apr 26, 2024 | 6:22 PM
OTT Movie: OTTలో ఇంత మంచి సినిమాని లైఫ్ లో చూసుండరు! ఇగోనే విలన్!

ఓటీటీ అనగానే ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు, లేదా సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు మాత్రమే కాదు, ఇప్పుడిప్పుడు ఓటీటీ లకు క్రేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి.. ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుంది .. ఏ సిరీస్ రిలీజ్ అవుతుంది అనే అప్ డేట్స్ వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. దీనితో అందరు ఆయా సినిమాలను సిరీస్ లను వెంటనే చూసేస్తున్నారు . కానీ, వీటికంటే ముందే వచ్చిన కొన్ని మంచి సినిమాలను మాత్రం మిస్ చేసేస్తున్నారు. మీరు ఇప్పటివరకు మిస్ చేసిన వాటిలో కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఉన్నట్లయితే ఒక మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ మిస్ అయినట్లే. ఆ సినిమా పేరే “పార్కింగ్”. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది, అసలు ఈ సినిమా కథేంటి .. ఎందుకు ఈ సినిమా మిస్ చేయకూడదు అనే సంగతులు తెలుసుకుందాం.

పార్కింగ్ సినిమాకు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. హరీష్ కళ్యాణ్, ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా తెలుగులో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్దె ఇంట్లో ఉంటున్న ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పి తీరాలి. మూవీ టైటిల్ చూస్తూనే పార్కింగ్ గురించి ఉంటుంది అని అర్థమౌతుంది . దానిని గురించి తెలిసిందే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం మంచి సినిమాను మిస్ చేసినట్లే సినిమా కథ విషయానికొస్తే.. ఈశ్వర్ అనే ఒక యువకుడు ఐటీ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతను ఇంట్లో వాళ్ళను ఎదురించి.. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరవాత తన భార్యాతో కలిసి ఒక అద్దె ఇంటికి షిఫ్ట్ అవుతాడు. అదే ఇంటి కింద ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒక అతను పదేళ్లుగా తన భార్య కూతురుతో కలిసి ఉంటాడు. అయితే, ఈశ్వర్ భార్య ప్రెగ్నెంట్ తో ఉండడంతో తను ఇబ్బంది పడకుండా ఒక కార్ ను కొంటాడు. ఇక అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

అద్దె ఇళ్లలో ఉండే పరిమితుల గురించి తెలిసిందే కదా. వారు ఉంటున్న ఇంటి వద్ద.. కేవలం ఒక కార్ పెట్టడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. అయితే ఆ కార్ ను అక్కడ పార్కింగ్ చేస్తున్న క్రమంలో.. ఆ ప్రభుత్వ ఉద్యోగి బండికి రాసుకుని గీతలు పడతాయి, ఇక అక్కడి నుంచి వారివురి మధ్య ఘర్షణలు మొదలవుతాయి. ఈశ్వర్ కు పోటీగా ఆ ప్రభుత్వ ఉద్యోగి కూడా కార్ కొంటాడు. పార్కింగ్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. ఆ గొడవలు కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాయి. ఆ తర్వాత గొడవలు ఎక్కడి వరకు దారితీశాయి ! ఈశ్వర్ భార్య, ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఎటువంటి ఇబ్బందులకు గురి అయ్యారు ! చివరికి వారివురిలో ఒకరైనా రాజీకి వచ్చారా లేదా! వారి కేస్ విషయం ఏమౌతుంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా పూర్తిగా చూడాల్సిందే. ఒక మంచి ఎమోషనల్ ఇంటెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా అందరికి ఇంట్రెస్ట్ కలిగిస్తుందని చెప్పడంలో.. ఏ సందేహం లేదు. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి