iDreamPost

Best Fantacy Movie In OTT: బాహుబలి రేంజ్ లో ఉండే వార్ బేస్డ్ మూవీ! OTTలో మిస్ కాకుండా చూడండి!

  • Published May 23, 2024 | 6:02 PMUpdated May 23, 2024 | 6:02 PM

కొన్ని సినిమాలను చూసిన వెంటనే వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలైతే రాలేదు. కాబట్టి ఎంచక్కా ఫ్యామిలి అంత కలిసి కూర్చుని చూసేలా ఉండే ఓ సినిమా గురించి చూసేద్దాం.

కొన్ని సినిమాలను చూసిన వెంటనే వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలైతే రాలేదు. కాబట్టి ఎంచక్కా ఫ్యామిలి అంత కలిసి కూర్చుని చూసేలా ఉండే ఓ సినిమా గురించి చూసేద్దాం.

  • Published May 23, 2024 | 6:02 PMUpdated May 23, 2024 | 6:02 PM
Best Fantacy Movie In OTT: బాహుబలి రేంజ్ లో ఉండే వార్ బేస్డ్ మూవీ! OTTలో మిస్ కాకుండా చూడండి!

రెగ్యులర్ లైఫ్ లో లేనివి ఊహ ప్రపంచంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఊహల్లో ఉండే ఎదో కోరుకుని దానిని వెండి తెరపైన చూసి ఆనందిస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో కొన్ని సినిమాలను చూసిన వెంటనే వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలైతే రాలేదు. కాబట్టి ఎంచక్కా ఫ్యామిలి అంత కలిసి కూర్చుని చూసేలా ఉండే ఓ సినిమా గురించి చూసేద్దాం. ఈ సినిమా చూస్తున్నపుడు దాదాపు అందరూ వేరే ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి ఓ వరల్డ్ ఉంటుందేమో అనే ఊహ మొదలవుతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ముందు ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. ఇంగ్లాండ్ లో ఆలిస్ అనే ఓ చిన్న పాపా ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు నిద్ర నుండి ఉలిక్కిపడుతుంది. ఓ రోజు ఇలానే తాను నిద్ర నుంచి లేచి.. తనకు వింత కలలు వస్తున్నాయని.. ఆ కలలో నవ్వే పిల్లి, విచిత్ర కుందేళ్లు తిరుగుతూ తనతో మాట్లాడుతున్నాయని చెప్తుంది. దీనితో ఆమె తండ్రి అది ఒట్టి కల మాత్రమేననని భయపడొద్దని చెప్తాడు. అలా కాలం గడిచిపోతుంది. కొంతకాలానికి ఆలిస్ వాళ్ళ నాన్న చనిపోతాడు. అయితే ఓ రోజు ఆలిస్ వాళ్ళ అమ్మ తనని ఓ గార్డెన్ కు తీసుకుని వెళ్తుంది. కానీ ఆలిస్ కు తెలియని విషయం ఏంటంటే ఆరోజు తన ఎంగేజ్మెంట్. అలా గార్డెన్ ల్యాండ్ కు వెళ్లిన ఆలిస్ కు ఏమి అర్థంకాదు. ఈ క్రమంలో ఆమె తాను పెళ్ళికొడుకుతో మాట్లాడుతుంది. మాట్లాడిన రెండు నిమిషాలకే ఆమె ఆ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అవుతుంది. ఇదే విషయాన్నీ అక్కడ వారందికీ చెప్తూ అక్కడ కనిపించిన ఓ కుందేలు వెనుక పరిగెడుతుంది.

అలా పరిగెడుతూ పరిగెడుతూ ఓ లోయలో పడిపోతుంది. ఆమె సడన్ గా మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమెకు వింత వింత అనుభవాలు ఎదురతాయి. అక్కడ ఆమె ఓ సైన్యంతో పోరాడి అండర్ వరల్డ్ ను వండర్ వరల్డ్ గా మార్చాల్సి వస్తుంది. ఆలిస్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అక్కడ ఆమె ఆ సోల్జర్స్ తో ఎలా పోరాడింది ? ఆ తర్వాత జరిగిన కథ ఏంటి ? ఇంతకీ ఇది కలా నిజమా ? ఇవన్నీ తెలియాలంటే “ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. పైగా ఈ సినిమాను తెలుగులో కూడా చూసేయొచ్చు. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి