iDreamPost

ప్రమాదానికి గురైన యజమాని.. రక్షించేందుకు 6 కి.మీ పరుగెత్తిన శునకం!

Dog Runs 6 km To Save Owner: మనుషులకు శునకాలకు మధ్య ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సంఘటనలు గురించి విన్నా, చదివినా అది నిజమే అనిపిస్తుంది. తాజాగా మరో ఘటన కుక్కలు అత్యంత విశ్వాసం గల జంతువని నిరూపించింది

Dog Runs 6 km To Save Owner: మనుషులకు శునకాలకు మధ్య ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సంఘటనలు గురించి విన్నా, చదివినా అది నిజమే అనిపిస్తుంది. తాజాగా మరో ఘటన కుక్కలు అత్యంత విశ్వాసం గల జంతువని నిరూపించింది

ప్రమాదానికి గురైన యజమాని.. రక్షించేందుకు 6 కి.మీ పరుగెత్తిన శునకం!

విశ్వాసానికి ప్రతీకగా శునకాన్ని పోలుస్తుంటారు.  కారణం..ఒక్కసారి  తనకు ముద్ద అన్నం పెట్టిన యజమాని కోసం ప్రాణాలను సైతం ఇస్తుంది. అనేక ప్రమాదాల నుంచి తన యజమాని కుటుంబ సభ్యులను శునకాలు కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. ఇక తమ ఓనర్ కి ఏదైనా జరిగితే.. మనుషుల కంటే ఎక్కువగా ఇవ్వి అల్లాడిపోతాయి. వారిపై బెంగపెట్టుకుని దిగాలుగా ఉంటాయి. ఇలా విశ్వాసానికి కుక్కలు చిహ్నాంగా నిలుస్తాయి. తాజాగా మరో ఘటన ఆ మాటను నిజం చేసింది. తన యజమాని లోయలో పడిపోతే.. 6 కిలోమీటర్లు పెరిగెత్తి..ప్రాణాలు కాపాడింది. మరి.. ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం..అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన ఈ సంఘటన నిజంగా కుక్కలకు ఉన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. జూన్ 2నవ తేదీన 62 ఏళ్ల బ్రాండన్ గారెట్ తన నాలుగు కుక్కలతో అడవుల్లో యాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు బ్రాండన్ గారెట్ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఇక ఆయనతో పాటు ఉన్న బ్లూ అనే కుక్క..తన యజమాని ప్రాణాలను నిలబెట్టేందుకు సాహసం చేసింది. దాదాపు 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గారెట్ ఫ్యామిలీ వద్దకు పరిగెత్తుకుని వెళ్లింది.

క్యాంప్‌సైట్‌లో ఒంటరిగా ఉన్న బ్లూని చూసిన తర్వాత కుటుంబం ప్రమాదం జరగిందని గ్రహించారు. ఆ వెంటనే బ్లూ ని అనుసరించి అడవిలో ప్రమాదానికి గురైన బ్రాండన్ కారు వద్దకు చేరుకున్నారు.  అంతేకాక అచేతన స్థితిలో ఉన్న బ్రాండన్ చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు 911కు ఫోన్ చేసి సహాయ బృందానికి సమాచారం అందించారు. అయితే అది కొండ ప్రాంతం కావడం, రాత్రంతా వాన కురవడంతో రెస్క్యూ ఆపరేషన్  చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో అసలు తన సోదరుడు బతికే ఉన్నాడా లేదా అని బ్రాండన్ సోదరుడు టెరీ  భయపడ్డాడు. చివరకు తాడుతో కట్టి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. కుక్క తెలివితో బ్రాండన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తన కుక్క బ్లూ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే వరకూ రాత్రంతా ఆ గుంటలో బ్రాండెన్ గడిపాడు.  మొత్తానికి తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఈ శునకం తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. బ్లూ తన తెలివితో తన యజమాని ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం ఆ బ్లూ శునకంపై బ్రాండెన్ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి