iDreamPost

Telangana Liquor Sales: తెలంగాణ మందు బాబులా మజాకా.. 2023లో ఎన్ని వేల కోట్లకి తాగారో తెలుసా?

శాలరీతో సంబంధం లేదు.. వీకెండ్, హాలీడేస్ తో పని లేదు. ఎప్పుడు తాగాలనిపిస్తే.. అప్పుడే బార్ షాపుకు వెళ్లాలా.. నచ్చింది ఆర్డర్ చేయాలా.. బాటిల్ ఎత్తితే దించకుండా తాగాలా. ఒక్కరే వెళితే ఎలా.. నలుగురి స్నేహితుల్ని వెంటేసుకెళ్లి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలా.. తెలంగాణలో గత ఏడాది మద్యం ప్రియులు ఎంత తాగారో తెలుసా..?

శాలరీతో సంబంధం లేదు.. వీకెండ్, హాలీడేస్ తో పని లేదు. ఎప్పుడు తాగాలనిపిస్తే.. అప్పుడే బార్ షాపుకు వెళ్లాలా.. నచ్చింది ఆర్డర్ చేయాలా.. బాటిల్ ఎత్తితే దించకుండా తాగాలా. ఒక్కరే వెళితే ఎలా.. నలుగురి స్నేహితుల్ని వెంటేసుకెళ్లి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలా.. తెలంగాణలో గత ఏడాది మద్యం ప్రియులు ఎంత తాగారో తెలుసా..?

Telangana Liquor Sales: తెలంగాణ మందు బాబులా మజాకా.. 2023లో ఎన్ని వేల కోట్లకి తాగారో తెలుసా?

తాము చేసే పనుల్లో మద్యం సేవించడాన్ని అత్యంత క్రేజీయెస్ట్ థింగ్‌గా ఫీలవుతుంటారు మగవాళ్లు. ప్రస్టేషన్ వచ్చినా, ఆనందం, విషాదం వచ్చినా.. కారణం ఏదైనా ఆశ్రయించే ఏకైక స్థానం బార్ షాప్స్. సాయంత్రం అయ్యే సరికి.. పొద్దున్నో, గత రాత్రో పెళ్లాం,ప్రియురాలితో జరిగిన గొడవో లేక.. స్నేహితులతో చిల్ అవుదామనో, బాస్ తిట్టాడనో.. ఏదో ఒక సాకుతో అసెంబుల్ అవుతుంటారిక్కడ. పెగ్గులు కాదూ బాటిళ్లకు బాటిల్స్ లేపేస్తుంటారు. ఇక మనసులో ఆవేదన, సంతోషాన్ని సగం అక్కడ కక్కి.. మిగిలినది, కడుపులోనిది ఇంటికొచ్చి కక్కుతుంటారు. గత ఏడాది ఒక్క తెలంగాణలోనే పీపాలకు పీపాలు తాగి.. ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తీసుకువచ్చారట ఈ మద్యం ప్రియులు.

గత సంవత్సరం అనగా 2023లో తెలంగాణలోని మందు బాబులు తాగిన మద్యం విలువ ఎంతో తెలుసా.. రూ. 36, 151 కోట్లు అట. లిక్కర్ కన్నా బీర్‌ను ఎక్కువగా సేవించారు. 3.58 కోట్ల విలువైన లిక్కర్ కేసులు, 5.34 కోట్ల కేసుల బీర్ గటగట తాగేశారు. 2022తో పోలిస్తే.. గత ఏడాది 2 వేల కోట్ల అదనం కావడం గమనార్హం. ఈ ఏడాది మొదలుతోనే మద్యం అమ్మకాలు కూడా జోరందుకున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లా వారీగా డేటా చేస్తూ.. అత్యధికంగా మద్యం అమ్ముడైన జిల్లాల్లో నిలిచింది ఏదో తెలుసా.. రంగారెడ్డి. రూ. 8,899. 44 కోట్లతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో రూ. 3758. 46 కోట్లు, వరంగల్‌లో రూ.3,549.41 కోట్ల మద్యం అమ్ముడైందట.

అలాగే ఏ నెలలో మందు వీరులు.. ఎక్కువగా తాగేరో తెలుసా.. మార్చి, మే, జూన్, జులై, డిసెంబర్ నెలల్లో. ఈ నెలల్లో వీరు తీసుకున్న తీర్థం కారణంగా.. మూడు వేల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయట. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో రూ. 3వేల కోట్ల కన్నా తక్కువగా సేల్ జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైన డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఈ నెలలో ఉంటాయి కాబట్టి.. భారీగా పుచ్చుకున్నారు మద్యం లవర్స్. ఈ నెలలో రూ.4297 కోట్ల విలువ చేసే.. 43.60 లక్షల కేసులు లిక్కర్‌, 46.22లక్షల కేసులు బీరు విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 28వ తేదీ నుంచి 31వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే రూ. 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే.. వామ్మో అనిపించకమానదు. ఈ ఏడాది కూడా అప్పుడే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయట. మరీ ఈ స్థాయిలో సేవించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి