iDreamPost

దేవి శ్రీ ప్రసాద్ రివ్యూ

దేవిశ్రీ ప్రసాద్ సినిమా కు సంబంధించి రెండు విషయాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటిది రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరును టైటిల్ గా పెట్టడంతో ఇది ఆయనకు సంబంధించిన కథా

దేవిశ్రీ ప్రసాద్ సినిమా కు సంబంధించి రెండు విషయాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటిది రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరును టైటిల్ గా పెట్టడంతో ఇది ఆయనకు సంబంధించిన కథా

దేవి శ్రీ ప్రసాద్ రివ్యూ

దేవిశ్రీ ప్రసాద్ సినిమా కు సంబంధించి రెండు విషయాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటిది రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరును టైటిల్ గా పెట్టడంతో ఇది ఆయనకు సంబంధించిన కథా… అనేట్టుగా పబ్లిసిటీ వచ్చింది. ఆ తర్వాత చిత్ర టీజర్ వదిలినప్పుడు… శవంతో సెక్స్ చేయడం అనే కాన్సెప్ట్ బయటికి వచ్చింది. అప్పటి నుంచి అటు ప్రేక్షకుల్లో ఇటు సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో ఏదో విషయం ఉందని అర్థమైంది. భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం దేవి శ్రీ ప్రసాద్ క్యారెక్టర్లో నటించారు. హీరోయిన్ గా పూజా రామ చంద్రన్ నటించింది. యశ్వంత్ మూవీస్, ఆర్వో క్రియేషన్స్ బ్యానర్లో ఆర్వీ రాజు, డి.వెంకటేష్, ఆక్రోష్ నిర్మించారు. దర్శకుడు శ్రీ కిషోర్ పబ్లిసిటీ లో సక్సెస్ అయినట్టుగానే సినిమాను కూడా బాగా డీల్ చేయగలిగాడా… లేదా అన్నది చూద్దాం.

కథేంటంటే…
దేవి (భూపాల్) ఆటో నడుపుతుంటాడు. శ్రీ (ధనరాజ్) హాస్పిటల్ లో కంపౌడర్. ప్రసాద్ (మనోజ్ నందం) టీ కొట్టు నడుపుతుంటాడు. వీరు ముగ్గురు మంచి స్నేహితులు. లీల ( పూజా రాంచంద్రన్) సినిమా స్టార్. లీల అంటే ఈ ముగ్గురికి ఇష్టం. ఆమెను కలవడానికి వెళితే సెక్యూరిటీ సిబ్బంది తోసేస్తారు. అలాంటి లీలకు యాక్సిడెంట్ అవుతుంది. చనిపోయిందని మార్చురీకి తరలిస్తారు. శ్రీ లీలను చూసి స్నేహితులకు ఫోన్ చేస్తాడు. దేవి, ప్రసాద్ మార్చురీకి వస్తారు. లీలను చూడగానే రేప్ చేయాలనిపిస్తుంది దేవికి. శ్రీ సపోర్ట్ చేసినప్పటికీ ప్రసాద్ మాత్రం వ్యతిరేకిస్తాడు. శవంతో సెక్స్ ఏంటని… తప్పని ఎదురు తిరుగుతాడు. వారి మధ్య గొడవ జరుగుతుంది. కానీ దేవి మాత్రం తాను అనుకున్న పని చేసేందుకు రెడీ అవుతాడు. అయితే వీరు అనుకున్న ప్రకారం కాకుండా కథ అడ్డం తిరుగుతుంది.

ఇంతకూ లీలను రేప్ చేశారా. లీలకు యాక్సిడెంట్ ఎలా జరిగింది. శవాన్ని ఎలా రేప్ చేశారు. స్నేహితుల మధ్య గొడవ ఎంతవరకు వెళ్లింది. ఆ గొడవల నుంచి ఎలా బయటపడ్డారు. అసలు లీల కథేంటి. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
దేవి శ్రీ ప్రసాద్ తరహా కథ, కథనం ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. శవాన్ని రేప్ చేయడమనేది తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త కథే అని చెప్పాలి. ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ కథ, కథనం, దర్శకత్వం. ఆర్టిస్టులు. భూపాల్, ధనరాజ్, ప్రసాద్ సరిగ్గా పాత్రలకు సరిపోయారు. వీరి ముగ్గురి పాత్రలకు దర్శకుడు బాగా న్యాయం చేశాడు. పాత్రల్ని తీర్చి దిద్దిన విధానం బాగుంది. క్యారెక్టర్స్ లో ఇన్ వాల్వ్ అయి చేశారు. అలాగే పూజా రామచంద్రన్ యాక్టింగ్ స్కిల్స్ ఇందులో చూడొచ్చు. ముఖ్యంగా రెండో భాగంలో ఆమెను చూస్తే జాలి వేసేంతగా పెర్ ఫార్మ్ చేసింది. లీల పాత్ర పూజాకు మంచి పేరు తెస్తుంది. పోసాని పోలీస్ ఆఫీసర్ గా ఇంట్రస్టింగ్ పాత్రలో కనిపించారు. నల్ల వేణు కామెడీ హైలైట్ గా ఉంటుంది. దెయ్యం అని భయపడే సీన్ తోపాటు మందు తాగి భూపాల్ తో చేసే హంగామా రిఫ్రెషింగ్ గా ఉంటుంది.

దర్శకుడు శ్రీ కిషోర్ కొత్త కాన్సెప్ట్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించాడు. తక్కువ బడ్జెట్ లో అయినా కథలో బలం ఉంది. ఆర్టిస్టులతో తనకు కావాల్సిన విధంగా నటన రాబట్టుకున్నాడు. శవాన్ని సెక్స్ చేయాలను కోవడం… స్నేహితుల మధ్య గొడవలు. ఆ తర్వాత లీల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, యాక్సిడెంట్… ఇవన్నీ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఆ ముగ్గురి నుంచి లీల తప్పిచుకునే విధానం బాగుంది. కమ్రాన్ బ్యౌక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. చంద్రమౌళి ఎడిటింగ్, ఫనీంద్ర కెమెరా వర్క్ బాగుంది. అయితే సెకండాఫ్ లో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. హాస్పిటల్ సీన్స్ ని ఇంకా పగడ్భందీగా ప్లాన్ చేయాల్సింది. కాన్సెప్ట్ బాగున్నా.. అక్కడక్కడ తేలిపోయినట్టుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా … ధనరాజ్, భూపాల్, మనోజ్ నందం, పూజా రాంచంద్రన్ పెర్ పార్మెన్స్, దర్శకుడు శ్రీ కిషోర్ కాన్పెప్ట్, దర్శకత్వ శైలి తెలుగు ప్రేక్షకులకు కొత్త సినిమా చూపిస్తుంది. కొత్త దనాన్ని, సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకుల్ని దేవిశ్రీ ప్రసాద్ ఎంటర్ టైన్ చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి