iDreamPost

లోకేష్ కి మరోసారి ఓటమి తప్పదా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?

లోకేష్ కి మరోసారి ఓటమి తప్పదా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యేగా గెలవకుండానే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవితో మంత్రిగా బాధ్యతల చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వివిధ కార్యక్రమాలు చేపడుతూ.. తరచూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటీవలే యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తాను మంగళగిరిని మరోసారి పోటీచేస్తాని, భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమ వ్యక్తం చేశాడు. అయితే మంగళగిరిలోని పరిస్థితిలు టీడీపీకి అనుకూలంగా లేవనే విషయాన్ని లోకేశ్ ఎలా మర్చిపోయాడని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోసారి కూడా లోకేశ్ కి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటానని మాజీ మంత్రి నారా లోకేశ్ అంటున్నారు. గత ఎన్నికల్లో లోకేశ్.. మంత్రి హోదాలో మంగళగిరి నుంచి పోటీ చేసి చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్ ఓడిపోయారు. మొట్ట‌మొద‌టి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోనే  లోకేశ్ ఓడిపోవడం.. చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఈ సారీ ఓడిపోయిన చోటే గెలిచి టీడీపీకి గిఫ్ట్ ఇస్తాన‌ని లోకేశ్ ధీమాగా చెబుతున్నారు. అయితే లోకేశే నిజానికి మంగ‌ళ‌గిరి అనేది టీడీపీ సీటు కానే కాదు.

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌, వైసీపీకి బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చేనేత‌ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారే అక్కడి అభ్యర్ధుల గెలుపోట‌ముల‌ను నిర్ణయిస్తారు. ఇదే సమయంలో అక్కడి చేనేత వర్గాలకు చెందిన బలమైన నాయకులు ఎమ్మెల్సీ ఎం. హనుమంతరావు, గంజి చిరంజీవి వైసీపీ పార్టీలోనే ఉన్నారు. బలమైన నేతలు వైసీపీలో ఉండటమే కాకుండా .. మంగళగిరి ప్రాంతంలో పేదలకు ఇళ్లను జగన్ సర్కార్ కేటాయించి. దీనిని టీడీపీ కోర్టు ద్వారా అడ్డుకుంది. టీడీపీ చేసిన ఈ పని మంగళగిరిలోని పేద ప్రజల్లో వ్యతిరేకతను పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇన్ని వ్యతిరేకతలతో టీడీపీ ఉంటే, ముచ్చ‌ట‌గా మూడోసారి మంగ‌ళ‌గిరి నుంచి వైసీపీ జెండా ఎగురే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయంట. ఇలా టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత, చేనేత నేతలు వైసీపీలో ఉండటం.. ఇలాంటి అంశాలు ప్రతికూలంగా ఉన్న.. గెలుస్తానే ధీమాగా లోకేశ్ చెప్పడం.. చిన్న లాజిక్ మిస్సైందనట్లేనని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు. మరోసారి మంగళగిరి లోకేశ్ కి ఓటమి తప్పదని చాలా మంది అంటున్నారు. మరి..  మంగళగిరిలో లోకేశ్ భవిష్యత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఈ నిర్ణయం యార్లగడ్డ ముందే తీసుకున్నారేమో?: సజ్జల

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి