iDreamPost

కూతురు అలా చేసిందని తల్లి ఆత్మహత్య!

అమ్మకు కూతురంటే ఎంతో ఇష్టం. కూతురికి కూడా తల్లంటే ఎంతో ప్రేమ. తల్లిని వదిలి ఉండలేకపోయేది. అయితే చదువు పూర్తయ్యాక ఉద్యోగానికని పొరుగు ఊరు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన కూతురు..

అమ్మకు కూతురంటే ఎంతో ఇష్టం. కూతురికి కూడా తల్లంటే ఎంతో ప్రేమ. తల్లిని వదిలి ఉండలేకపోయేది. అయితే చదువు పూర్తయ్యాక ఉద్యోగానికని పొరుగు ఊరు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన కూతురు..

కూతురు అలా చేసిందని తల్లి ఆత్మహత్య!

ఆ తల్లికి కూతురంటే విపరీతమైన ఇష్టం. కూతురికి కూడా అమ్మంటే ఎంతో అభిమానం. వాళ్లిద్దరూ తల్లీ కూతుళ్లు అనడం కన్నా .. అక్కా చెల్లెళ్లు, స్నేహితులు అనొచ్చు. అంతలా వీరి బంధం ముడిపడిపోయింది. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరు. అలాంటిది కూతురు దారుణ నిర్ణయం తీసుకుందని.. తల్లీ పేగు తల్లడిల్లిపోయింది. పదే పదే అదే విషయాన్ని తలచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. భర్త ఎంత నచ్చచెబుతున్నా.. తన కూతురు గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. చివరకు తన గారాల పట్టి.. తన కనుపాప లేని జీవితం తనకు వద్దని దారుణ నిర్ణయం తీసుకుంది కన్నతల్లి. వారం రోజుల వ్యవధిలో ఆ ఇంట్లో రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. తల్లిదండ్రుల్ని వదిలేసి కూతురు, భర్తను వదిలేసి భార్య తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కూతురు తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి తల్లడిల్లిన తల్లి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక.. అమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదాకర ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తిరుమరుకల్ పంచాయతీ గీజకరైయురిపు ప్రాంతంలో నివసిస్తోంది కార్తీకేయ కుటుంబం. ఆయనకు భార్య రాధిక, కూతురు దివ్య ఉన్నారు. 12వ తరగతి చదివిన దివ్య చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తల్లిని విడిచి ఉండలేక అతికష్టం మీదే వెళ్లింది. అయితే ఈ నెల 9న దివ్య ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కంటిపాపలా చూసుకున్న బిడ్డ.. ఉరికొయ్యకు వేలాడుతూ చూసిన తల్లి తట్టుకోలేకపోయింది.

కూతురు చనిపోవడంతో తల్లి రాధిక తీవ్ర మనోవేదనకు గురైంది. దివ్య లేదని, ఇక తిరిగి రాదని తెలిసిన ఆమె మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. హాహాకారాలు చేయగా..గమనించిన భర్త కార్తికేయ, ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి తీవ్రంగా గాయపడిన రాధికను రక్షించారు. అనంతరం 108 అంబులెన్స్‌లో ఒరత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రి వైద్యులు.. అప్పటికే ఆమె మరణించినట్లు పేర్కొన్నారు. 6 రోజుల క్రితం కూతురు ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత తల్లి బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటు భార్య, కూతుర్ని వారం వ్యవధిలో కోల్పోయి కార్తీకేయ కన్నీరుమున్నీరు అవుతున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి