iDreamPost

26 ఏళ్ళ అన్యోన్య సంసారం! ఒక్కరోజులో లెక్క అంతా మారిపోయింది!

జీవితాంతం భార్యను బాగా చూసుకుంటానని అగ్ని సాక్షిగా చేసిన బాసలను మర్చిపోతున్నారు కొంత మంది భర్తలు. భార్యతో నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ.. ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు..

జీవితాంతం భార్యను బాగా చూసుకుంటానని అగ్ని సాక్షిగా చేసిన బాసలను మర్చిపోతున్నారు కొంత మంది భర్తలు. భార్యతో నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ.. ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు..

26 ఏళ్ళ అన్యోన్య సంసారం! ఒక్కరోజులో లెక్క అంతా మారిపోయింది!

‘రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే..హరిచంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను,
ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొట్టగలను అందట’. ఇది సెంట్ పర్సెంట్ కరెక్ట్ అని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. రూపాయితోనే ప్రపంచమే నడుస్తుంది.. కాసులతోనే బంధం, బంధుత్వాలు కూడా ముడిపడి ఉన్నాయి. దుడ్డు ఉంటేనే మనిషిలా ట్రీట్ చేస్తున్నారు కొందరు. దీంతో రోజు రోజుకు దీనికి ప్రాధాన్యత పెరిగిపోయి.. ఒకే కుటుంబంలో భార్యా భర్తల మధ్య, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య చిచ్చు పెట్టడమే కాదూ.. ప్రాణాలు తీసేస్తుంది.

భార్యా భర్తల మధ్య ఈ రూపాయి పెట్టిన చిచ్చు.. ఒకరి ప్రాణం పోయేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్‌లో నివాసం ఉంటున్నారు భార్యా భర్తలు శ్రీనివాసులు, ఇందిర. వీరికి 26 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అన్యోన్యమైన కాపురం ఒక్కగానొక్క కూతురు అఖిల ఉంది. ఆమె కోసం అని నగలు, డబ్బులు దాచారు. కాగా, కూతురు నగలు, డబ్బుని శ్రీనివాస్..తన భార్యకు చెప్పకుండా వాడుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి నిలదీసింది. పలుమార్లు అడుగుతుండటంతో ఆమెపై మండిపడేవాడు. ఆదివారం కూడా ఇలా చేయడంతో.. కోపంతో భార్య ఇందిరపై గొడ్డలితో దాడి చేశాడు.

భర్త శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేయడంతో ఇందిర అక్కడిక్కడే మృతి చెందింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఇంటికి గడియపెట్టి పరారయ్యాడు. అంతలో కూతురు అఖిల ఫోన్ చేస్తే తల్లి లిఫ్ట్ చేయలేదు. తండ్రికి చేసినా ఉపయోగం లేదు. దీంతో ఏం జరిగిందా అని కూతురు ఇంటికి చేరుకుని చూసేసరికి రక్తపు మడుగుల్లో ఉన్న తల్లిని చూసి ఒక్కసారిగా ఖంగుతింది. తండ్రి ఆమెను చంపేశాడని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, మృతురాలు ఇందిర భర్త శ్రీనివాసును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి