iDreamPost

కూతురిని కడతేర్చిన కన్నతల్లి.. అతి కిరాతకంగా గొంతు నులిమి..

11 ఏళ్ల క్రితం పెళ్లైంది. భర్త సాఫ్ట్ వేర్. కుటుంబాన్ని మరింత ఉన్నంత చూసుకోవాలని విదేశాల బాట పట్టాడు. వీరికి ఇద్దరు కవలలు పుట్టారు. వారిలో ఒకరిని పొట్టనపెట్టుకుంది కసాయి తల్లి.

11 ఏళ్ల క్రితం పెళ్లైంది. భర్త సాఫ్ట్ వేర్. కుటుంబాన్ని మరింత ఉన్నంత చూసుకోవాలని విదేశాల బాట పట్టాడు. వీరికి ఇద్దరు కవలలు పుట్టారు. వారిలో ఒకరిని పొట్టనపెట్టుకుంది కసాయి తల్లి.

కూతురిని కడతేర్చిన కన్నతల్లి.. అతి కిరాతకంగా గొంతు నులిమి..

సృష్టికి మూలం అమ్మ. బిడ్డని నవ మోసాలు మోసి..కని పెంచేది అమ్మ. తాను చనిపోతానని తెలిసి కూడా.. తన బిడ్డకు ప్రాణం పోసేది మాతృమూర్తి. పొత్తిళ్లలోకి చేరిన బిడ్డల్ని ఎంతో అపురూపంగా చూసుకుటుంది. వారి కాలికి మన్నునంటనియ్యదు. వీరిపై ఈగవాలనియ్యదు. వారికి మాటలు నేర్పుతుంది. చిన్న చిన్న పాటలు నేర్పిస్తుంది. వారి ముద్దు ముద్దు మాటలతో మైమరిచిపోతుంది. తిననని గారాబం చేస్తే చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ కొసరి కొసరి గోరుముద్దులు తినిపిస్తుంది. అల్లరి చేస్తే తియ్యగా కసురుకుంటుంది. స్కూల్ కెళ్లేంత వరకు పిల్లల ఆలనా, పాలన..వారి ప్రేమ మైకంలో మునిగి తేలిపోతుంది. ఇక బడికి వెళ్లిన నాటి నుండి ఉద్యోగాల, పెళ్లిళ్లు చేసే వరకు కంటికి రెప్పలా కాపాడుతుంది. పిల్లలు ఎంత ఎదిగినా అమ్మకు చంటి బిడ్డలే.

కానీ ఈ తల్లి.. అభం,శుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకుంది. తనకు సాకడానికి భారంగా ఉందని భావించి హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుబ్రమణ్యపురం మంజునాథ్ నగర్‌లో నివాసముంటున్నారు భార్యా భర్తలు వెంకటేశ్, రమ్య. వీరికి 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. భర్త వెంకటేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఉద్యోగ రీత్యా నార్వేకు వెళ్లాడు. కాగా, ఇద్దరి పిల్లలకు ప్రస్తుతం మూడున్నరేళ్లు. వారిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. ప్రీతిక నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేది. దీంతో నిత్యం రమ్య  ఆవేదన చెందేది. దీంతో మానసికంగా కుంగ్రిపోయింది రమ్య.

చివరకు ఆ అమ్మాయి జీవితం ఏంటీ అని తీవ్రంగా ఆలోచించిన రమ్య.. కూతుర్ని గొంతు నొక్కి చంపేసింది. అనంతరం ఏమీ ఎరుగన్నట్లు.. ఆసుపత్రికి తీసుకు వచ్చి చూపించింది. దీంతో వైద్యులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపెట్టింది. కూతురు ఆటిజంతో బాధపడుతుందని, ఆమె బాధ చూడలేక చంపేశానంటూ చెప్పుకొచ్చింది. అనంతరం పోలీసులు మహిళపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. తండ్రి విదేశాల్లో ఉండటంతో చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఓ చిన్నారి భవిష్యత్తు గురించి తల్లి తీసుకున్న అనాలోచిత చర్య. . మరో చిన్నారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చింది. ఎందుకు తల్లీ.. అంత పనిచేశావ్.. ఆ పసిగొడ్డును చంపేందుకు చేతులెలా వచ్చాయమ్మా..? అంటూ చర్చించుకుంటున్నారు బంధువులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి