iDreamPost

వీడియో:బైక్‌పై రెచ్చిపోయిన లవర్స్.. తిక్క కుదిర్చిన పోలీసులు!

Bike Romance: ఇటీవల కొంతమంది లవర్స్ నడిరోడ్డుపై బైక్ నడుపుతూ రొమాన్స్ లో తెలిపోతున్నారు. దీని వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచన లేకుండా రోడ్డుపై రెచ్చిపోతున్నారు.

Bike Romance: ఇటీవల కొంతమంది లవర్స్ నడిరోడ్డుపై బైక్ నడుపుతూ రొమాన్స్ లో తెలిపోతున్నారు. దీని వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచన లేకుండా రోడ్డుపై రెచ్చిపోతున్నారు.

వీడియో:బైక్‌పై రెచ్చిపోయిన లవర్స్.. తిక్క కుదిర్చిన పోలీసులు!

ఈ మద్య కొంతమంది యూత్ కొత్త పోకడలకు పోతూ సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి తెస్తున్నారు. పాశ్చాత్య పోకడలకు పోతూ సమాజంలో తల దించుకునే పరిస్థితి తీసుకువస్తున్నారు. మొన్నటి వరకు మెట్రో రైల్, పార్కులు, బీచుల్లో లవర్స్ రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు పబ్లిక్ గా చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువ అయ్యాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది లవర్స్ బైక్ పై రెచ్చిపోతూ హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటూ రెచ్చిపోతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల  లవర్స్ రొమాన్స్ చేసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేనట్లు నడి రోడ్డుపై దుకాణం పెట్టేస్తున్నారు. బైక్ పై వెళ్తూ అబ్బాయికి ఎదురుగా అమ్మాయి కూర్చొని ముద్దులు, హగ్గులు ఇస్తూ రెచ్చిపోతు విమర్శల పాలవుతున్నారు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రియురాలికి మంచి థ్రిల్ ఇవ్వాలని కొతమంది కుర్రాళ్లు ఇలాంటి సాహసాలకు తెగబడుతున్నారు.  ఓ జంట రోడ్డుపై బైక్ నడుపుతూ డీప్ రొమాన్స్ లో మునిగిపోయారు. తాజాగా రాజస్థాన్ లో లవర్స్ రోడ్డుపై బైక్ నడుపుతూ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

రాజస్థాన్ లో లవర్స్ రాత్రి సమయంలో నడి రోడ్డుపై బైక్ నడుపుతూ స్పీడ్ గా వెళ్లడమే కాదు.. రొమాన్స్ చేస్తూ స్టంట్ చేశారు. వెనుక బైక్ నడుపుతున్న కొంతమంది వీడియో తీస్తూ కామెంట్స్ చేస్తుంటే ముద్దులు పెడుతూ మరింత రెచ్చిపోయింది ప్రియురాలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లవర్స్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఎక్స్ ద్వారా ట్యాగ్ చేశారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వీడియోలో ఉన్న వ్యక్తిని కైతూన్ గ్రామానికి చెందిన వసీమ్ గా గుర్తించారు. ఈ క్రమంలోనే తాము చేసిన తప్పకు అందరూ క్షమించాలని ఆ జంటతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు మంచి పనిచేశారు.. ఆ జంట తిక్క కుదిర్చారని మెచ్చుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి