iDreamPost

ఏపీలో 62 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో 62 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6497 శాంపిల్స్ పరీక్షించగా 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1525 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  441 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1051 గా నమోదయింది.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 మంది మరణించారు.

అత్యధికంగా కర్నూల్ లో 25 మందికి వైరస్ నిర్దారణ కాగా, కృష్ణాలో 12 మందికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. కాగా కోవిడ్ ఆసుపత్రులలో పనిచేయడానికి 1170 మంది డాక్టర్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే..

కాగా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్ లో ఉండగా,అనంతపురం,కడప,ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. విజయనగరం మాత్రం గ్రీన్ జోన్ లో ఉంది…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి