iDreamPost

రాజస్థాన్ కు చేరిన గుజరాత్ రాజ్యసభ రాజకీయం: రాజస్థాన్ రిసార్ట్‌కు గుజరాత్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

రాజస్థాన్ కు చేరిన గుజరాత్ రాజ్యసభ రాజకీయం: రాజస్థాన్ రిసార్ట్‌కు గుజరాత్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

గుజరాత్‌లోని రాజ్యసభ ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తుంది. తద్వారా నాలుగులో మూడుస్థానాలను సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్ట్ కి పంపింది. దీంతో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల రాజకీయం రాజస్థాన్ కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్‌లోని వివిధ రిసార్ట్ ల్లో ఉంచారు.

గుజరాత్‌లోని తమ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ రాజస్తాన్‌లోని ఒక రిసార్ట్‌కు తరలించింది. జూన్‌ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బిజెపి కుట్ర చేస్తోందని ఆరోపించింది.

182 మంది సభ్యుల గుజరాత్‌ అసెంబ్లీలో.. 77 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కు ప‌లువురు సభ్యుల రాజీనామా అనంతరం ప్రస్తుతం 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ గుజరాత్‌లోని రాజ్‌కోట్, అంబాజీ, ఆనంద్‌ల్లో ఉన్న రిసార్ట్‌లకు తరలించింది.

రాజ్‌కోట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్న నీల్‌సిటీ రిసార్ట్‌పై లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసు కేసు నమోదైంది. ‘ప్రస్తుతం రాజస్తాన్‌లోని అబు రోడ్‌లో ఉన్న రిసార్ట్‌లో 26 మంది మా ఎమ్మెల్యేలున్నారు. ఉత్తర గుజరాత్‌ నుంచి మరి కొందరు ఇంకా వస్తారు’ అని కాంగ్రెస్‌ నేత ఒకరు వెల్లడించారు. కరోనాతో పోరాడాల్సిన సమయంలో మా ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో బిజెపి బిజీగా ఉంది అని గుజరాత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమిత్‌ చావ్‌డా విమర్శించారు.

ఇటీవలి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇలా ముగ్గురు రాజీనామా చేయడంతో అప్రమత్తం అయినా కాంగ్రెస్ నివారణ చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ కు పంపింది. అక్క‌డ వారిని ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ స‌మ‌న్వ‌యం చేస్తున్నార‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఒకపక్క కరోనా వైరస్ తో అల్లడిపోతుంటే…మరోవైపు లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గుజరాత్‌లో మాత్రం రాజకీయాలతో బిజెపి, కాంగ్రెస్ కొట్టుమిట్టడుతయన్నాయి. వాస్తవానికి సమీపంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏమీ లేవు. కాని నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం బిజెపికి రాజ్యసభలో పూర్తి స్థాయి మెజారిటీ లేదు. కానీ రాజ్యసభలో బిజెపినే ఎక్కువ స్థానాలు కలిగి ఉంది.

ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని బిజెపి యోగిస్తుంది. అందులో భాగంగానే గుజరాత్‌లో నాలుగు స్థానాల్లో కనీసం మూడింటిని సొంతం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కేంద్రంలో నెంబర్‌వన్, నెంబర్ టూగా ఉన్న ప్రధాని‌ మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇద్దరి సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో అక్కడి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేక, ఓడలేక బిజెపి గట్కేక్కింది. అయితే ఆ పరిస్థితి రాజ్యసభ ఎన్నికల్లో రాకుండా కేంద్ర హోం మంత్రి వ్యూహ రచన చేస్తున్నారు.

మూడో స్థానం ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో ఉన్న బిజెపి…అందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కన్నెసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుంది. అయితే ప్రస్తుతం పార్టీలకున్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టీ బిజెపి, కాంగ్రెస్ లకు చెరో రెండు స్థానాలు వస్తాయి. కాని బిజెపి ముగ్గురను బరిలో దింపింది. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యే బలాలను బట్టీ ఇద్దరినే పోటీ పెట్టింది. దీంతో మూడో స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి యత్నిస్తుందని కాంగ్రెస్ కు అర్థం అయింది.

బిజెపి మూడోస్థానం గెలుచుకోవాలంటే కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగాల్సి వస్తుంది. అందులో భాగంగానే..ఇటీవలి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బిజెపితో జరిగిన బేరసారాలను బట్టే వారు రాజీనామా చేశారని గుజరాత్‌లో చర్చ జరుగుతుంది. అయితే 2017లో జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా గుజ‌రాత్‌లో ఇదే తంతు కొన‌సాగింది. అప్పుడు మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, బిజెపి త‌ర‌పున ముగ్గురిని బ‌రిలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి ఒక‌రు మాత్ర‌మే బ‌రిలోకి దిగారు. అప్ప‌టి బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బ‌ల్వాంత్ సిన్హా రాజ్‌పుత్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ త‌ర‌పున ఆ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి అహ్మ‌ద్ ప‌టేల్ బ‌రిలోకి దిగారు.

వాస్త‌వానికి అప్ప‌టికి ఉన్న ఎమ్మెల్యే బ‌లాబలాల‌ను బ‌ట్టీ బిజెపి రెండు, కాంగ్రెస్ ఒక రాజ్య‌స‌భ స్థానాల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉంది. కానీ బిజెపి త‌న కోటాకు మించి పోటీలో ఉంచింది. సాధార‌ణంగా కాంగ్రెస్‌కు వ‌చ్చే ఆ ఒక్క సీటు కూడా రాకుండా చేసేందుకు తీవ్ర ప్ర‌యత్నం బిజెపి చేసింది. అందుకే అహ్మ‌ద్ ప‌టేల్‌కు పోటీగా బ‌ల్వాంత్ సిన్హాను రంగంలోకి దింపింది. కానీ చివ‌రికీ బిజెపి ఓట‌మి చెందింది.

అహ్మ‌ద్‌ ప‌టేల్‌ను రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కాకుండా అమిత్ షా చాలా ఎత్తులు వేశాడు. అయితే ఆ స‌మ‌యంలో 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను క‌ర్ణాట‌కకు త‌ర‌లించారు. బెంగుళూర్ రిసార్ట్‌లో ఉంచారు. అప్పుడు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. అప్పుడు గుజ‌రాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బాధ్య‌త కర్ణాట‌కలోని డ‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అప్ప‌టి రాష్ట్ర మంత్రి, ప్ర‌స్తుత పిసిసి అధ్య‌క్షుడు డి.కె శివ కుమార్ చూసుకున్నారు.

2017లో గుజ‌రాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగుళూర్‌లో భ‌ద్రంగా ఉండ‌టంతో కాంగ్రెస్ నేత అహ్మ‌ద్ ప‌టేల్ రాజ్య‌స‌భ ఎన్నికల్లో అతిక‌ష్టం మీద గెలిపొందాడు. అతి క‌ష్టం మీద గెలిచాడ‌ని ఎందుకంటున్నామంటే…ఆయ‌న గెల‌వ‌కుండా అమిత్ షా అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌రికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యంతో అహ్మాద్ ప‌టేల్ గెలిచారు. అయితే బిజెపి ఎమ్మెల్యే న‌లిన్ కోటాడియా ప‌టేల్ ఉద్య‌మంలో 14 మంది యువ‌కులు మ‌ర‌ణించార‌ని, అందువ‌ల్ల బిజెపికి వ్య‌తిరేకంగా తాను ఓటు వేసిన‌ట్లు తెలిపారు. అయితే క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన త‌రువాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. కానీ కాంగ్రెస్ మ‌ద్ధ‌తుతో మిత్ర ప‌క్షంగా జెడిఎస్ నేత కుమార స్వామి అధికారాన్ని చేప‌ట్టారు.

అన‌తి కాలంలోనే అక్క‌డ చోటు చేసుకున్న‌ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా కుమార స్వామి అధికారాన్ని కోల్పోయారు. అప్పుడు కాంగ్రెస్‌, జెడిఎస్ కు చెందిన కొంత మంది ఎమ్మెల్యేల‌ను చీలిక తీసుకొచ్చి…వారిని మ‌హారాష్ట్రలోని ముంబాయిలో ఒక హోట‌ల్‌లో బిజెపి దాచిపెట్టింది. అప్పుడు మ‌హారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉంది. అయితే అప్పుడు కూడా డికె శివ‌కుమారే రంగంలోకి దిగాడు. ఎమ్మెల్యేల‌ను క‌లిసేందుకు శివ‌కుమార్ య‌త్నించారు. ముంబాయి వెళ్లి బిజెపి దాచిన కాంగ్రెస్‌, జెడిఎస్ ఎమ్మెల్యేల‌ను క‌లిసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. కానీ అందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. త‌రువాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు వ‌ల్ల క‌ర్ణాట‌క‌లో బిజెపి అధికారాన్ని చేప‌ట్టింది. సిఎం య‌డ్యూర‌ప్ప అయ్యారు.

ఇదిలా ఉంచింతే…డికె శివ‌కుమార్ పాల్గొన్న ఈ రెండు ఆప‌రేష‌న్‌లో ఒక దానిలో స‌క్స‌స్ అయింది. కానీ ఒక‌టి మాత్రం బిజెపికి అనుకూలంగా మారింది. ఇదిలా ఉంచితే…అయితే ఈ గెలుపు స‌హ‌క‌రించిన క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత డి.కె శివ కుమార్ పై అమిత్ షా క‌క్షగ‌ట్టారు. ఆయ‌న‌పై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) దాడులు జ‌రిపించారు. మ‌నీలాండ‌రింగ్ కేసులు దాఖ‌లు చేసి ఈడి విచార‌ణ జ‌రిపింది. విచార‌ణ త‌రువాత ఆయ‌న‌ను తీహార్ జైల్‌కు పంపించారు. 50 రోజుల పాటు జైల్లో ఉన్న శివ‌కుమార్ బెయిల్ పై విడుద‌ల అయ్యారు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లో మ‌ళ్లీ రాజ్య‌స‌భ ఎన్నిక‌లు వ‌చ్చాయి. నాలుగు స్థానాల‌కు పోటీ జ‌రుగుతుంది. అభ్య‌ర్థి గెలిచేందుకు క‌నీస ఓట్లు 34 రావ‌ల్సి ఉంది. ఇప్పుడు ఉన్న బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టీ ఆ రెండు పార్టీల‌కు చెరో రెండు స్థానాలు వ‌స్తాయి.

అయితే ఇప్పుడు కూడా బిజెపి అద‌నంగా మూడో స్థానానికి బ‌రిలో దింపింది. కాంగ్రెస్ మాత్రం ఇద్ద‌రిని మాత్ర‌మే పోటీలో నిలిపింది. దీంతో ఎన్నిక‌లు అనివార్యం అయ్యాయి. బిజెపి త‌ర‌పున అభయ్ భరద్వాజ్, రామిలాబెన్ బారా, నర్హరి అమీన్ ల‌ను బ‌రిలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున భారత్‌సిన్హా సోలంకి, శక్తిసిన్హా గోహిల్ ల‌ను పోటీలో నిలబెటింది.

182 ఎమ్మెల్యేల‌కు ప‌ది స్థానాల‌కు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం 172 మంది ఎమ్మెల్యేలు న్నారు. ఇందులో బిజెపి నుంచి 103, కాంగ్రెస్ 65, బిటిపి 2, ఎన్‌సిపి 1, స్వ‌తంత్రులు 1 ఉన్నారు. ఎన్‌సిపి, ఇండిపెండింట్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తారు. త‌న మ‌ద్ద‌తు ఎవ‌రిక‌నేది బిటిపి పార్టీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ప్ర‌తిప‌క్షంలోనే ఆ పార్టీ ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి