iDreamPost

బాబును నమ్మితే చంద్రముఖిని మళ్లీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లే: CM జగన్

Ys Jagan: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది.

Ys Jagan: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది.

బాబును నమ్మితే చంద్రముఖిని మళ్లీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లే: CM జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ గురించి  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకే వెళ్తోన్నాయి . ఎవరైనా అర్హత ఉండి ప్రభుత్వ స్కీమ్స్ అందని వారికి నేరుగా వాలంటీర్లు వెళ్లి.. వారి సమస్యను  పరిష్కరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో ఈ వ్యవస్థ ఎంతో కీలకం గా పని చేస్తుంది. వీరి సేవలకు గుర్తుగా ఏటా ప్రభుత్వం సేవవజ్రం, సేవ రత్నం, సేవ మిత్ర పేరిట అవార్డులను ప్రధానం చేస్తుంది. తాజాగా ఈ ఏడాది కూడా ఈ పురస్కారాలను ఏపీ ప్రభుత్వం ప్రధానం చేసింది. ఇందుకు గుంటూరు జిల్లా ఫిరంగిపురం వేదిక అయింది.

గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ‘వాలంటీర్ల అభినందన’ అనే సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన  వాలంటీర్లకు  సేవ వజ్రం, సేవరత్నం, సేవమిత్ర పేరిట  అవార్డులు ప్రధానం చేశారు. అనంతరం  సీఎం జగన్ ప్రసంగిస్తూ..వాలంటీర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. మీరు వాలంటీర్లు కాదు, సేవా హృదాయలని,  2.60 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యమని  ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు, ఆ కమిటీకి మన సచివాలయ వ్యవస్థకు మధ్య  చాలా తేడా ఉందని ఆయన తెలిపారు. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయని, మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆస్పత్రులు మారాయని సీఎం తెలిపారు.  అలానే గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాల్సి వచ్చేది, అలానే ప్రతీ పనికి  ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని సీఎం తెలిపారు.

ఇక ఇదే సభ నుంచి చంద్రబాబుపై సీఎం జగన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. “చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేది. అలానే గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థత దేశంలో ఎక్కడా లేదు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ..ప్రజలకు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.  గతంలో జన్మ భూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. చంద్రబాబు పాలన  విషవృక్షం, మన పాలన కల్పవృక్షం.  అలానే మనం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తులసి మొక్కలాంటిది.  మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి పుడితే.. చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్ లో పుట్టింది.

ప్రజలకు మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు. చంద్రబాబు వస్తే.. చంద్రముఖీని మళ్లీ మన ఇంటికి తెచ్చుకున్నట్లే. ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. ఒక్క జగన్ ఒకవైపు.. మరో వైపు దుష్టచతుష్టయం ఉంది. చంద్రబాబు కాలుకదపకుండా హైదరాబాద్  ఇంట్లో కూర్చుకుంటారు. వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు. వాటినే కిచిడీలు చేసి కొత్త మేనిఫెస్టో అంటారు. ఆ హామీలు అమలు చేసే పరిస్థితి కూడా రాష్ట్రానికి ఉండదు” అని సీఎం జగన్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి