iDreamPost

మోస్ట్ పాపులర్ సిఎంల జాబితా – 4వ స్ధానంలో జగన్

మోస్ట్ పాపులర్ సిఎంల జాబితా – 4వ స్ధానంలో జగన్

జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్ సిఎంల జాబితాలో నాలువగవ స్ధానం దక్కించుకున్నారు. మోస్ట్ పాపులర్ సిఎంలు ఎవరు అనే విషయంలో జాతీయ స్ధాయిలో ’సీ ఓటర్ ’ జరిపిన సర్వేలో జగన్ కు నాలుగవ స్ధానం దక్కింది. మొదటిసారి సిఎం అయినప్పటికీ చాలామంది సీనియర్లను వెనక్కుతోసి జగన్ 4వ స్ధానం దక్కించుకోవటం గమనార్హం. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది సిఎంలున్నారు.

మొదటిస్ధానంలో ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 82.96 శాతంతో మొదటి స్ధానంలో నిలిచారు. రెండోస్ధానంలో 81.06 శాతంతో చత్తీస్ ఘర్ సిఎం భూపేస్ భేగల్, మూడోస్ధానంలో కేరళ సిఎం పినరయ్ విజయన్ 80. 28 శాతంతో మూడోస్ధానంలో నిలిచారు. ఇక 78.01 శాతంతో నాలుగో స్ధానంలో జగన్ ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర సిఎం రాజ్ థాకారే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరివింద్ కేజ్రీవాల్, హిమాచల్ ప్రదేశ్ సిఎం జయ రామ్ థాకూర్, కర్నాటక సిఎం యడ్యూరప్ప తర్వాత స్ధానాల్లో నిలిచారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటిస్ధానంలో నిలిచిన నవీన్ పట్నాయక్ కు నాలుగో స్ధానంలో నిలిచిన జగన్ కు మధ్య సుమారు 4 శాతమే తేడా. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు సిఎం అయిన విషయం తెలిసిందే. జగన్ సిఎం అయి ఏడాది మాత్రమే అయ్యింది. అలాగే మూడోస్ధానంలో నిలిచిన పినరయి విజయన్ మొదటి సారే సిఎం అయినప్పటికీ గతంలో 1996-98లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. జగన్ తర్వాత స్ధానాల్లో నిలిచిన వారిలో కేజ్రీవాల్ మూడోసారి సిఎం అయ్యారు. కర్నాటకలో యడ్యూరప్ప కూడా మూడోసారి సిఎంగా ఉన్నారు. మహారాష్ట్ర సిఎం రాజ్ థాకరే మాత్రమే జగన్ తర్వాత సిఎం అయినవాడు.

ఏదేమైనా ఇంతమంది సీనియర్లున్నప్పటికీ జగన్ నాలుగోస్ధానంలో నిలిచారంటే గొప్పనే చెప్పాలి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపథకాలు, కరోనా వైరస్ నియంత్రణకు తసుకుంటున్న చర్యలు తదితరాల కారణంగా దేశంలో జగన్ కు మంచి గుర్తింపు వచ్చినట్లు అర్ధమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి