iDreamPost

ముస్లింలకు సీఎం జగన్ కీలక విన్నపం

ముస్లింలకు సీఎం జగన్ కీలక విన్నపం

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు కీలక విన్నపం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. దేశంలోనూ లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ ఉండనుంది.

ఈనెల 25వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు ముస్లిం మత పెద్దలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సామూహిక మత ప్రార్థనలకు అనుమతులు లేని విషయం వారికి తెలియజేసారు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. శ్రీరామనవమి , ఈస్టర్, రంజాన్ పండుగలు అందరూ కలసి జరుపుకోలేని కరోనా వల్ల ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. కరోనా వైరస్ వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ తప్పక పాటించాల్సిందేనని సీఎం జగన్ కోరారు.

సాధారణంగా ఈ మాసంలో ముస్లింలు మసీదులలో రోజుకు 5 సార్లు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. రంజాన్ మాసంలో నెల రోజులు పాటు ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సామూహికంగా ప్రార్ధనలు నిర్వహిస్తారు. నెల రోజులూ ఇఫ్తార్ విందులు జరుగుతాయి. హాలిమ్ సెంటర్లు వెలుస్తాయి. అన్ని మతాల వారు హాలిమ్ ను ఎంతో ఇష్టంగా తింటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి