iDreamPost

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. మారిన టీటీడీ వెబ్‌సైట్​..!

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ లక్షల్లో భక్తులు తరలి వస్తుంటారు. స్వామి వారి దర్శనానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది టీటీడీ. ఈ క్రమంలోనే భక్తుల కోసం వెబ్ సైట్ ఏర్పాటు చేసింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ లక్షల్లో భక్తులు తరలి వస్తుంటారు. స్వామి వారి దర్శనానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది టీటీడీ. ఈ క్రమంలోనే భక్తుల కోసం వెబ్ సైట్ ఏర్పాటు చేసింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. మారిన టీటీడీ వెబ్‌సైట్​..!

ప్రపంచంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల. ఏడు కొండలపై ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికంగానే కాదు.. పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో ప్రసిద్ది చెంది. ఇక్కడికి వేలు, లక్షల సంఖ్యల్లో భక్తులు దర్శించుకుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తల నీలాలు సమర్పిస్తారు భక్తులు. తమ కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకొని భక్తులు పరవశించిపోతారు. తిరుమల సందర్శనానికి దేశం నుంచే కాదు.. విదేశాల నుంచి సైతం ఎంతోమంది భక్తులు, పర్యాటకులు నిత్యం వేల సంఖ్యల్లో వస్తుంటారు. తాజాగా తిరుమల భక్తులకు టీటీడీ ముఖ్య సూచన చేసింది. వివరాల్లోకి వెళితే..

తిరుపతి సహా ఇతర ప్రాంతాల్లో టీటీడీకి అనుబంధ దేవాలయాలకు గొప్ప ప్రాచుర్యం కలిగించేలా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు సంబంధించిన అన్ని వివరాలతో ఒక వెబ్ సైట్ ని  ఆధునీకరించి ttdevasthanams.ap.gov.in ని టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. తిరుమల తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఈ వెబ్ సైట్ లో స్థానికంగా ఉండే ఆలయాలు, తిరుమలకు అనుబంధంగా ఉన్న ఆలయాల స్థల పురాణం, దర్శన వేళలు, ఆర్జిత వేళలు, రవాణా వివరాలుతో పాటు ఇతర సౌకర్యాలకు సంబంధించిన డిటైల్స్ పొందుపరిచారు.

alert for ttd devotees

అంతేకాదు తిరుమలకు సంబంధించిన ఆలయ విశిష్టతలపై ఫోటోలు, వీడియోలు సైతం ఇందులో పొందుపరిచారు. ఈ వెబ్ సైట్ ని జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఆధునీకరించింది. అయితే ఇప్పటి వరకు ఈ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉంది.. అయితే ఈ వెబ్ సైట్ లో మరింత మార్పులు చేర్పులు చేసి కొత్తగా ttdevasthanams.ap.gov.in గా మార్చారు. ఈ మేరకు వెబ్ సైట్ పేరును మార్చినట్లు భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్ లో భాగంగా ఆన్ లైన్ బుకింగ్ వెబ్ సైట్ ఇప్పుడు ttdevasthanams.ap.gov.inగా మార్చినట్లు టీటీడి అధికారులు తెలిపారు. తిరులమ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా ఈ వెబ్ సైట్ ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి