iDreamPost

దడలు పుట్టిస్తున్న టమాటా ధరలు.. మరింత పెరిగే అవకాశం!

దడలు పుట్టిస్తున్న టమాటా ధరలు.. మరింత పెరిగే అవకాశం!

దాదాపు నెల రోజులుగా టమాటా పేద వాడికి అందని వస్తువుగా మారిపోయింది. కిలో టమాటా 100 రూపాయలకుపైగా ధర పలుకుతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని చోట్ల కిలో టమాటా 250 రూపాయలకు అమ్ముడవుతోంది. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో ఈ పరిస్థితి నడుస్తోంది. నార్త్‌లో భారీ వర్షాల కారణంగా టమాట బంగారంగా మారిపోయింది. సరైన నిల్వలు లేని కారణంగా అత్యధిక ధరలకు అమ్ముడవుతోంది.

మరికొన్ని రోజుల్లో దక్షిణాదిన కూడా ఇదే పరిస్థితి తలత్తే అవకాశం ఉంది. వర్షాల కారణంగా టమాట ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో టమాటా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కో చోట ఒక్కో రేటు పలుకుతోంది. కిలో 100 నుంచి 150 రూపాయలుగా ఉంటోంది. వర్షాలు బాగా పెరిగితే గనుక ఈ రేటు 200లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. వర్షాల కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతంలో పంట నష్టం అయింది. రోడ్డు బాగా దెబ్బతినటంతో కూరగాయల ట్రాన్స్‌పోర్టు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ముంబై లాంటి ప్రాంతాల్లో మరో రెండు రోజుల్లోనే టమాటా ధరలు 200లకు చేరే అకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టమాటా ధరలు ఎంత పెరిగినా.. రైతులు లాభ పడేది మాత్రం కొన్ని రోజులే. ఎందుకంటే.. టమాటా ధరలు తగ్గిన తర్వాత మళ్లీ రూపాయికి, రెండు రూపాయలకు కిలో అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి తోడు వర్షాల కారణంగా పంట నష్టం జరిగి చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు చూసినా రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగులుతున్నాయి. మరి, మరికొన్ని రోజుల్లో టమాటా ధరలు పెరగుతాయన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి