iDreamPost

Champai Soren: ఝార్ఖండ్‌ రాజకీయాల్లో ఊహించని మలుపు! CMగా సింప్లిసిటీ మ్యాన్‌?

  • Published Feb 01, 2024 | 1:05 PMUpdated Feb 01, 2024 | 1:05 PM

ఝార్ఖండ్‌ రాష్ట్ర రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకున్నాయి. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న హేమంత్‌ సోరెన్‌ దిగిపోతే.. ఆయన భార్య సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు వేరే పేరు తెరపైకి వచ్చింది.

ఝార్ఖండ్‌ రాష్ట్ర రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకున్నాయి. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న హేమంత్‌ సోరెన్‌ దిగిపోతే.. ఆయన భార్య సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు వేరే పేరు తెరపైకి వచ్చింది.

  • Published Feb 01, 2024 | 1:05 PMUpdated Feb 01, 2024 | 1:05 PM
Champai Soren: ఝార్ఖండ్‌ రాజకీయాల్లో ఊహించని మలుపు! CMగా సింప్లిసిటీ మ్యాన్‌?

ఝార్ఖండ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. హేమంత్‌ రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన భార్య కల్పనా సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. అందుకోసం అంతా సిద్ధం కూడా చేశారు. కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరి నిమిషంలో మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆయనే చంపయీ సోరెన్‌. ఎంతో నిరాడంబరంగా ఉంటే ఈ నేత.. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జేఎంఎం-కాంగ్రెస్ కూటమి నాయకులు గవర్నర్‌ను కలిసి తన కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చంపయీ పేరును ప్రతిపాదిస్తూ.. 43 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించారు.

ఎవరీ చంపయీ సోరెన్‌..?
ఝార్ఖండ్‌ ముక్తి మోర్చాకు చెందిన 67 ఏళ్ల చంపయీ సోరెన్‌.. ఝార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పైగా ఆయన ఎంతో సింపుల్‌గా ఉంటూ.. ఎవరు ఏ సమస్యతో వచ్చినా వెంటనే సోషల్‌ మీడియాలో ఆ సమస్యను చెబుతూ సంబంధిత అధికారులను ట్యాగ్‌ చేస్తుంటారు. ఇది ఆయన ప్రతి రోజు చేసే పని. దీంతో ఆయన మంచి పేరొచ్చింది. సోషల్‌ మీడియాను ఆయన ఈ రేంజ్‌లో వాడుతున్నా.. ఆయన చదువుకుంది మాత్రం కేవలం పదో తరగతి వరకే. అయినా కూడ ప్రజా సేవలో ఆయనకు ఆయనే సాటి. 11 నవంబర్ 1956లో జన్మించిన చంపయీ సోరెన్‌.. సరాయ్‌కెలా ఖర్‌సాంవా జిల్లా గమ్హారియాలోని జిలింగ్‌గోఢాకు చెందిన చంపయి సోరెన్ రైతు కుటుంబానికి వ్యక్తి. ఆరుగురి సంతానంలో చంపయీ సోరెన్ మూడోవారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న సోరెన్‌కు ఏడుగురు సంతానం.

1991లో సరాయ్‌కెలా ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, తొలిసారి గెలిచారు. ఆ తర్వాత 1995లో గెలుపొందినా, 2000లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2005 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఝార్ఖండ్‌ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం నాటి నుంచి జేఎంఎం పార్టీ అధినేత శిబు సోరెన్‌తో ఆయనకు అనుబంధం దృష్ట్యా ఆయనను సీఎం పదవీ వరించనుంది. శిబు సోరెన్‌, హేమంత్‌ సోరెన్‌కు చంపయీపై నమ్మకం ఉండటంతో ఆయనే ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించారు. అందుకు పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలంతా అంగీకారం తెలపడంతో ఆయన పేరును గవర్నర్‌కు ప్రతిపాదించారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది గవర్నర్‌ వెల్లడించనున్నారు. మరి ఒక సాదాసీదా నేత, కేవలం పదో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి