iDreamPost

చంద్రబాబు అరెస్ట్…పురందేశ్వరికి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్!

చంద్రబాబు అరెస్ట్…పురందేశ్వరికి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2014-19 కాలంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు రూ.240 కోట్లు అవకతవకలకు పాల్పడ్డారన్నఆరోపణలతో సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసి.. విజయవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను అధికార, విపక్షాలు స్పందిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు చంద్రబాబు అరెస్టు సమర్ధిస్తున్నారు. అలానే ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు.  చంద్రబాబు నాయుడు అరెస్ట్ పద్ధతి ప్రకారం జరగలేదని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్ కి  ఏపీ క్రీడా శాఖమంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

నంద్యాలో చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ ఆధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. చంద్రబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని అన్నారు. అలానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె చంద్రబాబు ఆరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజు చంద్రబాబు నాయుడి గారిని అరెస్ట్ చేయడం జరిగింది.  సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ  తీసుకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని  అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బీజేపీ దీనిని ఖండిస్తుంది” అంటూ ట్విటీ చేసింది. అయితే పురంధేశ్వరి ట్వీట్ పై ఏపీ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా  కౌంటర్ ఇచ్చారు.

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?, ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లోనే సెక్షన్ల, ఏయే ఏయే నేరాలు వర్తిస్తాయో ప్రస్తావించారు మంత్రి రోజా. చంద్రబాబు అరెస్ట్ సమర్థనీయం  కాదా?. అని పురందేశ్వరిని ప్రశ్నించారు. అలాగే.. బీజేపీని మీ బావ జనతా పార్టీగా మార్చేశారంటూ పురందేశ్వరికి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలానే పురందేశ్వరి ట్విట్ పై పలువురు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పద్ధతి ప్రకారం జరగలేదని పురందేశ్వరి  తెగ బాధ పడిపోతున్నట్లున్నారని  కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పురందేశ్వరికి మంత్రి రోజా ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి