iDreamPost

గుండె పోటుతో BRS నేత రమేష్ మృతి

కరోనా తర్వాత మనిషి ఆరోగ్య పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. చూస్తుండగానే మనలోని వ్యక్తి ఉన్నపళంగా నేలకొరుగుతున్నాడు. ఏం జరిగిందా అని తెలుసుకునే లోపే పిడుగులాంటి వార్త..

కరోనా తర్వాత మనిషి ఆరోగ్య పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. చూస్తుండగానే మనలోని వ్యక్తి ఉన్నపళంగా నేలకొరుగుతున్నాడు. ఏం జరిగిందా అని తెలుసుకునే లోపే పిడుగులాంటి వార్త..

గుండె పోటుతో BRS నేత రమేష్ మృతి

మానవ జీవితం తామరాకుపై నీటి బొట్టులాంటిది అని అంటుంటారు పెద్దలు. అలాగే వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదూ అని చెబుతుంటారు. ఎప్పుడు ఎలా ప్రాణం పోతుందో చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు.. ఈ క్షణం చూస్తున్న మనిషి.. మరుసటి నిమిషంలో కనిపించడం లేదు. ఆరోగ్య పరంగా పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కరోనా తర్వాత మరింత దిగజారిపోయాయి. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు కళ్ల ముందే తమకిష్టమైన వ్యక్తులు కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. విషాదాలుగా మారిపోతున్నాయి. ఇలాంటి మరణాలకు ముఖ్య కారణంగా మారిపోయింది గుండె పోటు.

ఎక్కడ చూసినా హార్ట్ ఎటాక్ తో చనిపోయారంటూ వార్తలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత గుండె పోటుతో మరణించారు. సుల్తానాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీత భర్త, బీఆర్ఎస్ నేత ముత్యం రమేష్ చనిపోయారు. తన నివాసంలో అస్వస్థతకు గురి కాగా, గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండె పోటుతో మరణించినట్టు తెలిపారు. రమేష్ మృతదేహానికి బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. కాగా, ఇటీవల సుల్తానాబాద్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న ముత్యం సునీతపై చేపట్టిన అవిశ్వాస పరీక్షలో ఆమె నెగ్గింది. ఇంతలోనే సునీత భర్త మరణించారు.

ఇటీవల వరుసగా గుండె పోటుతో మరణించిన వారి సంఖ్య పెరిగింది. మొన్న ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్.. డ్యూటీలో ఉండగానే గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన వాహనాన్ని నిలిపివేశాడు లేకుంటే..మరింత మంది ప్రాణాలు పోయేవి. ఆయన సమయ స్ఫూర్తికి మెచ్చుకోవచ్చు. అంత మంది ప్రాణాలు కాపాడి.. ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడు. అలాగే నిన్న జగిత్యాలలో 9 ఏళ్ల బాలుడు.. ఉన్న పళంగా నేలకొరిగాడు. ఏం జరిగిందని ఆసుపత్రికి తీసుకెళితే.. బాబు హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయారంటూ వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి