iDreamPost

వీడియో: కువైట్ లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు భారతీయులు సహా.. 35 మంది మృతి!

Big Fire Outbreak In A Building In Kuwait: కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ భవనంలో మొత్తం 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు భారతీయులు సజీవదహనం అయ్యారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.

Big Fire Outbreak In A Building In Kuwait: కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ భవనంలో మొత్తం 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు భారతీయులు సజీవదహనం అయ్యారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.

వీడియో: కువైట్ లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు భారతీయులు సహా.. 35 మంది మృతి!

కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ భారీ అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కువైట్ లోని మంగఫ్ సిటీలో ఈ ఘోం సంభవించింది. కువైట్ ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికల ప్రకారం ఇద్దరు నార్త్ ఇండియన్స్, ఇద్దరు తమిళనాడుకు చెందిన వ్యక్తులు సహా మొత్తం 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే భారతీయుల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

కువైట్ లో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో ఎంతో మందికి గాయాలు అయ్యాయి. కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలించారు. దగ్గర్లోని ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించినట్లు తెలుస్తోంది. వైద్యులు వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున లేబర్ క్యాంపు భవనంలోని కిచెన్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు కమ్మెసినట్లు చెబుతున్నారు.

అగ్ని ప్రమాదం సంభవించిన ఆ భవనం ఒక భారతీయ వ్యాపారవేత్తకు చెందిందిగా తెలుస్తోంది. ఆ భవనంలో మొత్తం 195 మంది వరకు కార్మికులు ఉంటారు. దగ్గర్లో ఉండే పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు. ఎన్టీబీసీ గ్రూపునకు చెందిన మలయాళీ వ్యాపారవేత్త కేజీ అబ్రహాం వద్ద పనిచేసే కార్మికులుగా చెబుతున్నారు. ఆ భవనంలో ఉండేవారిలో ఎక్కువ మంది కేరళకు చెందిన కార్మికులే ఉన్నారు. ఆ భవనంలో మంటలను ఆర్పేశారు. కానీ, ఇంకా భవనంలో చాలా మంది చిక్కుకుని ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు, అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి