iDreamPost

Balakrishna, TDP: TDPకి మరో తలనొప్పి.. అడ్డం తిరిగిన బాలయ్య అల్లుడు!

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఈ తరుణంలో టీడీపీలో అనేక విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్లు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఈ తరుణంలో టీడీపీలో అనేక విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్లు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

Balakrishna, TDP: TDPకి మరో తలనొప్పి.. అడ్డం తిరిగిన బాలయ్య అల్లుడు!

ఏపీ ఎన్నికలు టీడీపీకి తలనొప్పిగా మారాయనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా  బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్న తరుణంలో టీడీపీలో అనేక విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్లు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇలా కేవలం వివిధ నియోజవర్గాలకు చెందిన నేతలే కాకుండా చంద్రబాబు బంధువుల నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకతే వ్యక్తమవుతుంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు బాబుకు తలనొప్పిగా మారగా.. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు కూడా అడ్డం తిరిగారని తెలుస్తోంది.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాల విషయం ఓ కొలిక్కి వచ్చింది. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు, జనసేన, బీజేపీ కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజవర్గాల్లో ఎప్పటి నుంచి టికెట్ పై ఆశపెట్టుకున్న టీడీపీ నేతలకు పొత్తులో భాగంగా తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో వారు చంద్రబాబు మాటలనే ధిక్కరిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు పార్టీలు మారాగ, మరికొందరు పార్టీలోనే ఉంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలోకి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌ చేరారు.

విశాఖ జిల్లా నుంచి  అసెంబ్లీ బరిలో నిలిచే విషయంలో అధిష్టానంపైనే కాలు దువ్వుతున్నాడని తెలుస్తోంది. 2019లో టీడీపీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి..భరత్ ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ఆ విధంగానే విశాఖ నార్త్ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా.. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. విష్ణు కుమార్ రాజు 2014లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మరోసారి కూటమిలో భాగంగా ఆయననే బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భరత్‌  చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

భరత్.. విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలవాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. మామ బాలకృష్ణ మద్దతు ఉండడంతో టికెట్‌ తనకేనని భావించారు. అయితే తాజాగా టీడీపీకి, కమలం పార్టీకి పొత్తు కుదరడంతో కొత్త సమస్యలు వచ్చాయి. సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ స్థాయి టీడీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇస్తే.. అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినా సహకరించేది లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది.

వీరి మాటలకు భరత్‌ స్పందిస్తూ ఈసారి తాను విశాఖ నార్త్ టికెట్‌ తీసుకుని పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.  బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు పార్టీ కార్యాలయం ప్రారంభించి తిరుగుతున్నారని, మీరు పోటీ చేస్తామంటే ఎలా నమ్మాలని పలువురు కార్యకర్తలు ప్రశ్నించారంట. కానీ భరత్‌ మాత్రం తానే పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారని తెలుస్తోంది. మొత్తంగా భరత్‌ కొత్త సమస్యలు సృష్టిస్తాడా.. లేక సర్దుకుపోతాడ తెలియాల్సి ఉంది. మొత్తంగా బాలయ్య అల్లుడు కూడా బాబుకు అడ్డం తిరుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి