iDreamPost

BhamaKalapam-2: ఓటీటీలోకి భామా కలాపం-2.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jan 31, 2024 | 1:46 PMUpdated Mar 14, 2024 | 4:54 PM

సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "భామాకలాపం". 2022 లో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయిన ఆహ లో విడుదల చేయగా.. మంచి టాక్ ను సంపాదించుకుంది. దీనితో మేకర్స్ "భామాకలాపం-2" ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "భామాకలాపం". 2022 లో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయిన ఆహ లో విడుదల చేయగా.. మంచి టాక్ ను సంపాదించుకుంది. దీనితో మేకర్స్ "భామాకలాపం-2" ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jan 31, 2024 | 1:46 PMUpdated Mar 14, 2024 | 4:54 PM
BhamaKalapam-2: ఓటీటీలోకి భామా కలాపం-2..  స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఈ మధ్య కాలంలో ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మేకర్స్ కూడా మంచి క్వాలిటీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీనితో వెండితెరపైన మంచి పేరున్న వ్యక్తులు కూడా ఓటీటీలో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ప్రియమణి ప్రధాన పాత్రలో అలరించిన భామాకలాపం చిత్రం ఆహ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అయింది. అప్పట్లో ఈ చిత్రనికి మంచి ఆదరణ లభించింది. దీనితో ఇప్పుడు ఈ చిత్రానికి సిక్వెల్ గా “భామాకలాపం-2” కి శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేశారు. అలానే ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారట మేకర్స్. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

భామాకలాపం-2 చిత్రానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. ఇప్పుడు భామాకలాపం-2 మీద ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలాలో పోషించారు. విడుదలైన టీజర్ ను గమనిస్తే క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్‌గా భామాకలాపం 2 మూవీ రాబోతుంది. అలానే ప్రియమణి, శరణ్య ప్రదీప్ ఇద్దరూ కలిసి ఓ దొంగతనం చేసేందుకు ప్రయత్నించడం.. చుట్టూ ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక భామాకలాపం-2 మరలా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో.. ఫిబ్రవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు కానుంది. ఈ విషయాన్ని ఆహా తాజాగా అధికారికంగా ప్రకటించింది. అటు సినిమా టీజర్ తో పాటు.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది.

bhama kalapam 2 in ott

ఇక టీజర్ విషయానికొస్తే.. భామాకలాపం పార్ట్ 1ను గుర్తుచేస్తూ.. పార్ట్ 2 ను స్టార్ట్ చేశారు. ఈ మూవీలో అనుపమ పాత్రలో ప్రియమణి నటించారు. గతాన్ని మళ్లీ తమ లైఫ్‍లోకి తీసుకురాకూడదని అనుమప వద్ద ఆమె భర్త మాట తీసుకుంటాడు. “అనుపమ అనే నేను.. పక్కనవాళ్ల విషయాల్లో తలదూర్చనని.. నా పని నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాటఇస్తున్నాను” అని అనుపమ చెబుతుంది. కానీ, హోటల్ ను నడిపే ఆమె అనేక విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అలాగే అనుపమ, శిల్ప పాత్ర చేసిన శరణ్య ఇద్దరు కలిసి ఒక శవాన్ని పూడ్చి పెడుతూ ఉంటారు. చూడబోతుంటే ఇందులో క్రైం పార్ట్ కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఓ బంగారు కోడి ఈ టీజర్లో హైలైట్‍గా అయింది. దానిని దొంగిలించడమే ఈ చిత్రంలో కీలకంగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇలా ఒక క్రైం హీస్ట్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించనుంది.

అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం ఆహ “అక్కడ జరిగింది ఒకటి, వీళ్లు చూపించేది ఒకటి! అసలు ఏం జరిగిందో ఆహాలో చూద్దాం. భామాకలాపం టీజర్ వచ్చేసింది. డబుల్ ఎంటర్‌టైన్‍మెంట్ అందించేందుకు డేంజరస్ హౌస్‍వైఫ్ అనుపమ రెడీ అయ్యారు. ఈ మూవీని ఫిబ్రవరి 16వ తేదీన హాట్‍గా సర్వ్ చేస్తాం” అని ఆహా సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇక త్వరలో ఆహలో స్ట్రీమింగ్ కానున్న భామాకలాపం-2 ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, తాజాగా రిలీజ్ అయిన భామాకలాపం-2 టీజర్ పై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి