iDreamPost

హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాల మీద బ్యాంకులు విధించే ఛార్జీలు!

Charges On Loans: బ్యాంకుల్లో అనేక రకాల లోన్స్ అందుబాటులో ఉన్నాయి చాలా మంది లోన్ల కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా కావాల్సిన లోన్ కి అప్లై చేస్తారు. అయితే వీటి మీద పలు రకాల ఛార్జీలు అనేవి విధిస్తాయి బ్యాంకులు. మరి ఆ ఛార్జీలు ఏంటో తెలుసుకోండి.   

Charges On Loans: బ్యాంకుల్లో అనేక రకాల లోన్స్ అందుబాటులో ఉన్నాయి చాలా మంది లోన్ల కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా కావాల్సిన లోన్ కి అప్లై చేస్తారు. అయితే వీటి మీద పలు రకాల ఛార్జీలు అనేవి విధిస్తాయి బ్యాంకులు. మరి ఆ ఛార్జీలు ఏంటో తెలుసుకోండి.   

హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాల మీద బ్యాంకులు విధించే ఛార్జీలు!

బ్యాంకుల్లో చాలా మంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంటి రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన ఋణం, విద్య ఋణం వంటివి ఇలా అనేక రకాల లోన్స్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లోన్స్ కి సంబంధించి బ్యాంకులు విధించే ఛార్జీలు కొన్ని ఉంటాయి. ఆ ఛార్జీలు ఏంటో అనే విషయం తెలుసుకోవడం లోన్ తీసుకునేవారికి చాలా ముఖ్యం. బ్యాంకు వాళ్ళు కూడా అన్నిసార్లు కస్టమర్లకు ఈ విషయం చెప్పరు. ఈ కథనంలో ఆయా బ్యాంకులు ఆయా రుణాల మీద వసూలు చేసే ఛార్జీల గురించి తెలుసుకోండి.

వ్యక్తిగత ఋణం:

వ్యక్తిగత లోన్ (పర్సనల్ లోన్) తీసుకునేవారికి లోన్ మీద 0.5 శాతం నుంచి 2.50 శాతం వరకూ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి మారుతుంది. అలానే పర్సనల్ లోన్ పై వెరిఫికేషన్ ఛార్జీలు ఉంటాయి. లోన్ టెన్యూర్ కి ముందుగానే క్లియర్ చేయాలనుకుంటే ఫోర్ క్లోజర్ ఛార్జీలు ఉంటాయి. ఈ ఛార్జీలు 2 నుంచి 4 శాతం వరకూ ఉండచ్చు. ఈఎంఐ పేమెంట్ ఆలస్యం చేస్తే పెనాల్టీ ఛార్జీలు పడతాయి.    

హోమ్ లోన్:

హోమ్ లోన్ ని మంజూరు చేయడం కోసం ఆయా బ్యాంకులు కస్టమర్ల నుంచి తీసుకున్న డాక్యుమెంట్లని బాగా పరిశీలిస్తాయి. మొత్తం లోన్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేస్తాయి. లోన్ క్లియర్ చేసేవరకూ ఆస్తి పేపర్లను బ్యాంకులు భద్రపరిచినందుకు గాను కొంత ఛార్జీలు విధిస్తాయి. ఒకవేళ ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్ కి హోమ్ లోన్ ని ట్రాన్స్ ఫర్ చేయాలనుకుంటే కనుక దీనికి కొంత ఛార్జీలు ఉంటాయి. ఇక ఫిక్స్డ్ వడ్డీ రేటుతో హోమ్ లోన్ తీసుకుని ముందుగా లోన్ క్లియర్ చేస్తే ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ఉంటాయి. ఇది 2 నుంచి 6 శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు, టెక్నికల్ లేదా లీగల్ అసెస్మెంట్ ఫీజు వంటివి ఉండడంతో పాటు వీటి మీద బ్యాంకులు జీఎస్టీ వసూలు చేస్తాయి.

ఎడ్యుకేషనల్ లోన్:

ఎడ్యుకేషనల్ లోన్ ప్రాసెస్ చేసేందుకు కూడా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుని వధూల్ చేస్తాయి. ఇది లోన్ లో 1 శాతం వరకూ ఉంటుంది. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకపోతే వడ్డీ అదనంగా పడుతుంది. ఈ వడ్డీ ప్రభుత్వ బ్యాంకుల్లో 0.05 నుంచి 0.25 శాతంగా ఉండగా.. ప్రైవేట్ బ్యాంకుల్లో 2 శాతం వరకూ ఉంటుంది.   

వెహికల్ లోన్:

కారు కొనేందుకు బ్యాంకులో కార్ లోన్ తీసుకోవాలనుకుంటే.. దాన్ని ప్రాసెస్ చేసేందుకు, మంజూరు చేసేందుకు ఛార్జీలను బ్యాంకులు లోన్ తీసుకునే కస్టమర్ల నుంచి వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు తీసుకునే లోన్ లో 0.50 శాతం నుంచి 1 శాతం వరకూ ఉంటుంది. వెయ్యి రూపాయల నుంచి 9 వేల రూపాయల మధ్యలో ఉంటుంది. కారు లోన్ ని అనుకున్న గడువు కంటే ముందే క్లోజ్ చేయాలనుకుంటే ఫ్లోర్ క్లోజర్ ఛార్జీలు అనేవి పడతాయి. లోన్ తీసుకున్న మొదటి ఏడాది తర్వాత క్లియర్ చేయాలనుకుంటే బ్యాంకులు లోన్ మొత్తం మీద 5 శాతం ఛార్జీలను వసూలు చేస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి