iDreamPost

రూ.3 లక్షల అప్పుతో వ్యాపారం..1300కోట్ల ఆదాయం..అసిన్ భర్త సక్సెస్ స్టోరీ!

Asin Husband Rahul Sharma: వ్యాపార రంగంలో విజేతలు నిలిచిన ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు. ఇలాంటివారిలో కొందరు తమకు వచ్చే సమస్యలకు ధైర్యంగా ఎదురు నిలబడి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగి..మనకు గొప్పగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ అసిన్ భర్త ఒకరు.

Asin Husband Rahul Sharma: వ్యాపార రంగంలో విజేతలు నిలిచిన ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు. ఇలాంటివారిలో కొందరు తమకు వచ్చే సమస్యలకు ధైర్యంగా ఎదురు నిలబడి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగి..మనకు గొప్పగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ అసిన్ భర్త ఒకరు.

రూ.3 లక్షల అప్పుతో వ్యాపారం..1300కోట్ల ఆదాయం..అసిన్ భర్త సక్సెస్ స్టోరీ!

మనకు ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నవారు కనిపిస్తుంటారు. వ్యాపార రంగంలో విజేతలుగా నిలించి మంచి గుర్తింపు సంపాదిస్తుంటారు. అయితే చాలా మంది అంత ఈజీగా సక్సెస్ ను అందుకులేదు. ఎన్నో కష్టనష్టాలు అనుభవించి.. ఆర్థిక, ఇతర సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్ని విజేతలుగా నిలిచారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్, మలయాళ భామ అసిన్ భర్త ఒకరు. కేవలం 3 లక్షలు అప్పుగా తీసుకుని, నేడు 1300 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడు. ఈయన సక్సెస్ స్టోరీ.. సినిమాలకు మించి ట్విస్ట్ లు ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి వంటి సినిమాల్లో నటించిన అసిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శివమణి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. అలానే రవితేజ హీరోగా నటించిన అమ్మనాన్న  ఓ తమిళ అమ్మాయి సినిమాలో అమాయకపు అమ్మాయిల నటించి కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తరువాత పలువురు టాలీవుడ్ హీరోల సరసన నటించింది మెప్పించింది. 2016లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మేన్ ను అసిన్ వివాహం చేసుకుంది. ఈయన ప్రముఖ ప్రారిశ్రామిక వేత్త.. వేలకోట్ల సామ్రాజ్యానికి అధినాయకుడు.

రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ గా పట్టపొందాడు. ఆ తరువాత కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. స్టడీ పూరైతన వెంటనే రాహుల్ శర్మ తన తండ్రి నుంచి రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అప్పుడు రూ. 3 లక్షల అప్పుతో ప్రారంభించినా ఇప్పుడు ఈయన నికర విలువ ఏకంగా రూ. 1300 కోట్లు ఉంది.

రాహుల్ శర్మ మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు. రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరా అనే స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ను స్థాపించారు. మొదట్లో ఇది ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉండేది.  ఆ తరువాత 2008లో మొబైల్ మార్కెట్‌లోకి ఈ సంస్థ ప్రవేశించింది. 2010 నాటికి హ్యూ జాక్‌మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా దేశంలోనే టాప్ లో నిలిచింది. 2017లో భారతదేశపు తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్  కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా ఈయనే. రాహుల్ శర్మ, అసిన్ లకు 2016లో వివాహం జరగ్గా..ప్రస్తుతం ఈ జంటకు అరిన్ రేన్ అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం వీరు ఢిల్లీలో నివాసం ఉంటున్నారని సమాచారం. మొత్తంగా అసిన్ భర్త సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి