iDreamPost

గ్రూప్-1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి AP సర్కార్ గ్రీన్ సిగ్నల్!

గ్రూప్-1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి AP సర్కార్ గ్రీన్ సిగ్నల్!

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగాల భర్తీకి అంగీకరం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొత్తం 597 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. గ్రూప్-1కి 89 పోస్టులు, గ్రూపు-2కి 508 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుంది. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-2, అసిస్టెంట్ కమిషనర్(ST), అసిస్టెంట్ ట్రెజరీ సహా పలు పోస్టులను గ్రూప్-1 కింద భర్తీ చేయనున్నారు. గ్రూపు-2 కేటగిరీలో డిప్యూటీ తహసీల్దార్(గ్రేడ్ 2), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్, గ్రేట్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు సహా పలు పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి