iDreamPost

Apple Watch: యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇవి కూడా ట్రాక్ చేస్తుందా?

  • Published Jun 15, 2024 | 6:20 PMUpdated Jun 15, 2024 | 6:20 PM

యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కాపడగా.. తాజాగా దీనిలో మరో కొత్త ఫీచర్‌ను కూడా గుర్తించారు. ఇది ఓ వ్యాధి లక్షణాలను ట్రాక్‌ చేస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆ వివరాలు..

యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కాపడగా.. తాజాగా దీనిలో మరో కొత్త ఫీచర్‌ను కూడా గుర్తించారు. ఇది ఓ వ్యాధి లక్షణాలను ట్రాక్‌ చేస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆ వివరాలు..

  • Published Jun 15, 2024 | 6:20 PMUpdated Jun 15, 2024 | 6:20 PM
Apple Watch: యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇవి కూడా ట్రాక్ చేస్తుందా?

యాపిల్ ఎన్నో టెక్ డివైస్ లను మొదటిగా కనిపెట్టిన సంస్థ, మొదటి ఐపాడ్, మొదటి ట్యాబ్ ఇలా చెప్పుకుంటూ పోతే యాపిల్ వి అనేక ఆవిష్కరణలు ఉంటాయి, కాని కేవలం ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా దాని నుండి మనిషి కి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి అని ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటుంది యాపిల్‌ కంపెనీ యాజమాన్యం. యాపిల్‌ కంపెనీ నుంచి ట్యాబ్ ని, ఐపాడ్ అని, మాక్ బుక్ అని, ఇయర్ పోడ్స్ అని, ఇలా ఎన్నో ఉత్పత్తులు రాగా.. స్మార్ట్‌వాచ్‌లను కూడా తీసుకువచ్చింది. ఇక వీటి స్పెషాలిటీ ఏంటి అంటే స్మార్ట్ ఫీచర్లతో, ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. యాపిల్ వాచ్‌లోనిఎస్‌ఓఎస్‌ ఫీచర్ నిజంగా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్, కోవిడ్‌ టైం లో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది, ఎమర్జెన్సీ టైంలో మెడికల్ సిబ్బందికి కీలక సమాచారాన్ని ఇచ్చి సహాయపడేది.

అది ఎలాగంటే మన చేతికి ఉన్న ఈ స్మార్ట్ వాచ్ మన బ్లడ్ ప్రెషర్ ని అలాగే మన హార్ట్ బీట్ ని, మనం డైలీ వేసే అడుగులు, ఎన్ని కేలోరీస్ కరిగిస్తున్నాం ఇలా ప్రతీది కూడా లెక్క కట్టి మెడికల్ సిబ్బందికి ఇవ్వడం వలన వారికి ట్రీట్మెంట్ చెయ్యడం చాలా ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు యాపిల్ స్మార్ట్‌వాచ్ పనితీరుపై మరొక సెన్సేషనల్ విషయం బయటకి వచ్చింది. ఒక రీసెర్చ్ ప్రకారం, యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను గుర్తించగలవని, ఈ వివరాలు వ్యాధిని అర్థం చేసుకోవడంలో అలాగే చికిత్సలో ఉపయోగపడతాయని తెలిపారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ న్యూరాలజిస్టులు ప్రకారం ఈ యాపిల్ స్మార్ట్ వాచ్ పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభదశలో ఉన్న వ్యక్తులను పరిశీలించడానికి యాపిల్ సంస్థతో కలిసి ఒక సంవత్సరంపాటు ఉపయోగించారు. ఈ రిసెర్చ్లో, వాయిస్ రికార్డింగ్‌ల ద్వారా వాయిస్‌కు సంబంధించిన అనేక డీటైల్స్ ద్వారా పార్కిన్ సన్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ ని గుర్తించారు. జామీ ఆడమ్స్ ఈయన రోచెస్టర్ మెడికల్ సెంటర్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, ఈయన ప్రకారం, ఈ డిజిటల్ విధానంలో పార్కిన్సన్స్ వ్యాధిలో పురోగతిని అలాగే ఇంకా అనేక సున్నితమైన వివరాలను మేము తెలుసుకున్నాం అని తెలిపారు.

స్మార్ట్‌ఫోన్ అలాగే స్మార్ట్‌వాచ్‌ల ద్వారా తీసుకున్న వ్యాధి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు, పరీక్షించొచ్చు, ఇంకా మార్పులను గమనించవచ్చు. ఈ వివరాలు ఫ్యూచర్ మెడికల్ ప్రొసీజర్స్ కి ఉపయోగపడతాయి. ఈ అధ్యయనం ఇంకా పార్కిన్సన్స్ క్లినికల్ ట్రయల్స్‌లో కూడా వాడచ్చుఅని చెబుతున్నారు, అలాగే ట్రీట్మెంట్ చేసే విధానాన్ని ఇంకా స్పీడ్ గా డెవలప్ చేయడంలో కూడా, ఇంకా రోగులకు వేగంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

స్మార్ట్‌వాచ్ ద్వారా పార్కిన్సన్స్ లక్షణాలకు సంబంధించి చాలా మార్పులను గుర్తించారు. ఎన్‌హెచ్‌ఎస్‌ ప్రకారం, పార్కిన్సన్స్ వ్యాధిలో వణుకు లాగే శరీర కదలికలు చాలా సాధారణం కన్నా తక్కువగా ఉంటాయి, ఇది డైలీ చేసే పనులను కష్టతరం చేస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు 12 నెలలపాటు యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను కలిపి రిసెర్చ్లో ఉపయోగించారు.

యాపిల్ స్మార్ట్‌వాచ్‌లోని ఎస్‌ఓఎస్‌ అలాగే ఫాల్ డిటెక్షన్ ఫీచర్లు ఇప్పటికే చాలా మంది యూజర్ల ప్రాణాలను చివరి నిమిషంలో కూడా కాపాడాయి. ఈ ఎస్‌ఓఎస్‌ ఫీచర్ అత్యవసర సమయాల్లో మెడికల్ స్టాఫ్ కి అలాగే మన కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అలాగే, ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఇది పొరపాటున ఆ స్మార్ట్ వాచ్ పెట్టుకున్న యూజర్ అనుకోకుండా పడిపోతే ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. ఇది పెద్ద శబ్దంతో అలారంను కూడా మోగిస్తుంది. అప్పటికీ యూజర్ స్పృహలోకి రాకుంటే, ఈ ఫీచర్ ద్వారా రిజిస్టర్ చేసిన ఫ్యామిలీ కాంటాక్ట్స్ అలాగే ఎమర్జెన్సీ బృందాలకు ఇన్ఫర్మేషన్ ని పంపుతుంది, దాని వలన సమయానికి చికిత్స అంది ఎంతో మంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి