iDreamPost

మరో రెండ్రోజులు వర్షాలు.. ఆ జిల్లాల వారికి బిగ్ అలర్ట్!

AP Rain Alert- Heavy Rain Forecast For These Districts: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.

AP Rain Alert- Heavy Rain Forecast For These Districts: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.

మరో రెండ్రోజులు వర్షాలు.. ఆ జిల్లాల వారికి బిగ్ అలర్ట్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. దాదాపుగా వర్షాకాలం మొదలైపోయింది. ఇప్పుడు ఏపీలోని ఆ జిల్లాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. అధికారుల ప్రకటన ప్రకారం బుధవారం, గురువారం రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అసలు ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం.. బుధవారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్క పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పార్వతీపురం, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, ప్రకాశం, పల్నాడు, కర్నూలు, చిత్తూరు, వెఎస్సార్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో అక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు.

ఇంక గురువారం రోజున ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గురువారం రోజున కూడా దాదాపుగా ఆ జిల్లాల్లోనే వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, మన్యం, కాకినాడ, తూ.గో. ప.గో. కోనసీమ, బాపట్ల, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పల్నాడు, అనంతపురం, చిత్తూరు, సత్యసాయిబాబా జిల్లా, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా పొలాలకు వెళ్లే రైతులు, కూలీలను కూడా అధికారులు హెచ్చరించారు. అలాగే గేదెలు, గొర్రెలను తీసుకెళ్లే కాపరులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, కూలీలు, కాపర్లు పవర్ పోల్స్, చెట్లు, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండద్దు అంటూ సూచించారు. వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి